మాజీ సీఎం బయటికొచ్చారు.. !!
Hemat Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే హైకోర్టు తుది తీర్పును ఇచ్చింది. హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ పరిణామం సంభవించింది.
భూ కుంభకోణం ఆరోపణలు హేమంత్ సోరెన్‌పై ఉన్నాయి. 8.36 ఎకరాల భూమిని మనీలాండరింగ్ ద్వారా ఆక్రమించినట్లు గతంలో ఆయనపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఆరు నెలల పాటు హేమంత్ సోరెన్ విచారణను ఎదుర్కొన్నారు.

అరెస్ట్ సమయంలో హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, అరెస్ట్ అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన రాజీనామా తరువాత చంపై సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు.
2023లో బడ్‌గైన్ ప్రాంతంలో ల్యాండ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న భాను ప్రతాప్ ప్రసాద్ అనే వ్యక్తి అరెస్టు కావడంతో ఈ కేసుకు చెందిన డొంక కదిలింది. ఆయన నుంచి అనేక ఒరిజినల్ భూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఫోన్‌లో హేమంత్ సోరెన్ అక్రమించినట్లుగా భావించిన 8.36 ఎకరాల భూ లేఅవుట్‌లు లభించాయి.
ఈ క్రమంలో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను విచారించాలని నిర్ణయించారు. 10 సార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. ఇందులో ఎనిమిదింటిని ఆయన దాటవేశారు. విచారణకు హాజరు కాలేదు. దీనితో ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. విచారణ సందర్భంగా హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేదని హైకోర్టు భావించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications