సూర్య సినిమా లైవ్ లో చూసిన జ్యూవెలరీ షోరూమ్ ఉద్యోగులు, డీవీఆర్ తెచ్చిన తంటా !
జువెలరీ షాపుపై అధికారులు దాడులు చేశారు. లక్షలాది రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది క్షణాల్లో బంగారు నగలతో నకిలీ అధికారులు సిటి దాటి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే అక్కడే సినిమా స్టైల్లో ఓ సీన్ జరిగింది. బంగారు నగల షోరూమ్ లో సోదాలు చెయ్యడానికి వచ్చిన అధికారులు నకిలీ అని తేలింది. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్ సినిమాను బెంగళూరులో లైవ్ లో చూపించారు.
బెంగళూరు సిటీలోని కేఆర్‌పుర పరిధిలోని భట్టరహళ్లిలోని మహాలక్ష్మి జ్యువెలర్స్ షాపుపై నకిలీ అధికారుల బృందం దాడి చేసింది. జీఎస్టీ, బీఐఎస్ అధికారులు ( వీళ్లు నకిలీ అధికారులు)గా జ్యూవెలరీ షోరూమ్ యజమానులను పరిచయం చేసుకున్నారు. మీ నగల దుకాణాన్ని తనిఖీ చేయాలని నకిలీ అధికారులు బంగారు నగల షోరూమ్ యజమానులు, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి చాలా సీరియస్ గా చెప్పారు.

వెంటనే అందరి జోబుల్లో ఉన్న ఐడీ కార్డులు అక్కడి సిబ్బందికి చూపించారు. ఐడీ కార్డులు చూసిన సిబ్బంది తప్పనిసరిగా వాళ్లు జీఎస్టీ అధికారులే అని గుడ్డిగా నమ్మేసి వారి దగ్గర ఉన్న అన్ని మొబైల్ ఫోన్లు నకిలీ అధికారులకు అందజేసి మౌనంగా నిలబడిపోయారు. హాల్‌మార్క్, జీఎస్టీ బిల్లులు, బీఐఎస్ వంటి వాటిని పరిశీలించాలని చెప్పిన నిందితులు జ్యూవెలరీ షోరూమ్ లో ఉన్న బంగారు నగలు అన్ని తనిఖీ చేశారు.
సుమారు రెండు కేజీల బంగారు నగలను బ్యాగులో వేసుకున్న నిందితులు మీరు మూడు రోజుల తర్వాత చెన్నైలోని మా ఆఫీస్ కి రావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సమయంలో జ్యూవెలరీ షోరూమ్ లో ఉన్న సీసీటీవీ డీవీఆర్ తీసుకున్న నిందితులు పక్కాప్లాన్ తో దానిని బ్యాగ్ లో పెట్టుకున్నారు. సీసీటీవీ డీవీఆర్ బ్యాగ్ లో పెట్టుకోవడంతో బంగారు నగల షోరూమ్ సిబ్బందికి సందేహం వచ్చింది. బంగారాన్ని నింపిన బ్యాగ్ లతో నకిలీ అధికారుల బృందం కారులో బయలుదేరి కేఆర్ పుర వైపు వెళ్లిపోయారు.
జ్యూవెలర్స్ షోరూమ్ కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు బైక్‌పైలపై నకిలీ అధికారులు వెలుతున్న కారును వెంబడించారు. కానీ మార్గమధ్యంలో కారును నిలిపిన నకిలీ అధికారులు మా కారును వెంబడించవద్దని బెదిరించారు. నకిలీ అధికారులను చూసిన వెంటనే ఇద్దరు యువకులకు ఇంకా అనుమానం పెరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ తర్వాత భయాందోళనకు గురైన నకిలీ అధికారులు కారు దిగి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

బంగారు నగల బ్యాగ్ లు చేతిలో పట్టుకున్న నకిలీ అధికారులు రోడ్డుపైకి వచ్చి కేఆర్ పురం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో జ్యువెలరీ షాప్ సిబ్బంది హేమరాజ్ హెల్మెట్‌తో నకిలీ అధికారులు వచ్చిన కారు అద్దాన్ని కొట్టడంతో స్థానికులు కూడా కారును వెంబడించి ఆ వాహనం నిలిపేశారు. ఆతరువాత నిందితులు కారు దిగి బంగారు నగల బ్యాగ్ తీసుకుని సందు గొందుల్లో పరుగు తీస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పారిపోతున్న నకిలీ అధికారులు సంపత్ కుమార్, జోషి థామస్, అవినాష్, ముఖేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన నలుగురు నిందితులు కేరళ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని, కేజీఎఫ్‌లో అద్దె ఇల్లు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.నకిలీ జీఎస్టీ అధికారులు బంగారు నగల షోరూమ్ లో సీసీటీవీ డీవీఆర్ తీసుకుని చిన్న పొరపాటు చెయ్యడంతో కథ పూర్తిగా మారిపోయిందని, లేదంటే రూ. 80 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దొంగలపాలై ఉండేదని, నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications