Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Family: మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు నలుగురు, తండ్రిని పక్కాప్లాన్ తో చంపిన కొడుకు, కిల్లర్స్ !

బెంగళూరు/యాదగిరి: కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన లెక్చరర్ తరువాత భార్యను, పిల్లలను గాలికి వదిలేసి వెళ్లిపోయాడు. రెండో పెళ్లి చేసుకున్న లెక్చరర్ ఆమెతో కాపురం చేశాడు. రెండో భార్యకు నలుగురు పిల్లలు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి మొదటి భార్య, పిల్లల గురించి పట్టించుకోవడం మానేసిన లెక్చరర్ అతని రెండో భార్యకు పూర్తిగా అంకితం అయిపోయాడు. ప్రతినెల జీతం రెండో భార్యకు ఇచ్చేశాడు. ఆస్తి మొత్తం రెండో భార్యకు రాసిచ్చాడు. కొన్ని నెలల తరువాత ప్రిన్సిపాల్ కు ప్రమోషన్ సంపాధించనున్న ఈయన రెండు సంవత్సరాల తరువాత రిటైడ్ కానునున్నాడు. ఇదే సమయంలో మొదటి భార్య కొడుకు, కిరాయి హంతకులు కలిసి లెక్చరర్ ను పట్టపగలు అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

గర్ల్స్ కాలేజ్ లెక్చరర్

గర్ల్స్ కాలేజ్ లెక్చరర్

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలుకాలోని గోపాలపురంలో నివాసం ఉంటున్న మానప్ప (59) దేవదుర్గలోని ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 25 సంవత్సరాల క్రితం మానప్ప ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. మానప్ప మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలం మొదటి భార్యతో మానప్ప చాలా సంతోషంగా ఉన్నాడు.

రెండో పెళ్లి చేసుకున్న లెక్చరర్

రెండో పెళ్లి చేసుకున్న లెక్చరర్

కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన లెక్చరర్ మానప్ప తరువాత భార్యను, పిల్లలను గాలికి వదిలేసి వెళ్లిపోయాడు. తాయమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న లెక్చరర్ మానప్ప ఆమెతో కాపురం చేశాడు. రెండో భార్య తాయమ్మకు నలుగురు పిల్లలు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి మొదటి భార్య, పిల్లల గురించి పట్టించుకోవడం మానేసిన లెక్చరర్ మానప్ప అతని రెండో భార్య తాయమ్మకు పూర్తిగా అంకితం అయిపోయాడు.

తండ్రి మీద రగిలిపోయిన కొడుకు

తండ్రి మీద రగిలిపోయిన కొడుకు

మానప్ప ప్రతినెల జీతం రెండో భార్య తాయమ్మకు ఇచ్చేస్తున్నాడు. ఆస్తి మొత్తం రెండో భార్య తాయమ్మకు రాసిచ్చాడు. కొన్ని నెలల తరువాత ప్రిన్సిపాల్ కు ప్రమోషన్ సంపాధించనున్న మానప్ప ఈయన రెండు సంవత్సరాల తరువాత రిటైడ్ కానునున్నాడు. తన తల్లికి, మాక మా నాన్న మానప్ప అన్యాయం చేశాడని అతని మొదటి భార్య కొడుకు బసవలింగ రగిలిపోతున్నాడు.

 కిరాయి హంతకులతో కలిసి తండ్రిని చంపిన కొడుకు

కిరాయి హంతకులతో కలిసి తండ్రిని చంపిన కొడుకు

తన తండ్రి మానప్పను హత్య చెయ్యడానికి అతని కొడుకు బసవలింగ కిరాయి హంతకులు సురేష్, మాదేశ తదితరులతో డీల్ మాట్లాడుకున్నారు. మద్యాహ్నం కాలేజ్ నుంచి మానప్ప ఇంటికి బయలుదేరాడు. ఇదే సమయంలో మొదటి భార్య కొడుకు బపవలింగ, అతను నియమించిన కిరాయి హంతకులు కలిసి కాలేజ్ లెక్చరర్ మానప్పను పట్టపగలు నడిరోడ్డులో అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+