ఐపీఎల్ బెట్టింగ్, లాటరీ స్కాం: ఐపీఎస్ పై లంచం కేసు
బెంగళూరు: లాటరీ స్కాం కుంబకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటూ సస్పెండ్ అయిన ఐజీపి స్థాయి అధికారి అలోక్ కుమార్ మీద మరొ కేసు నమోదు అయ్యింది. ఈసారి ఏకంగా కర్ణాటక లోకాయుక్త అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రూ. 7,000 కోట్ల లాటరీ స్కాం కేసులో అరెస్టు అయిన కింగ్ పిన్ పారి రాజన్ తో సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల కారణంగా బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ ను సస్పెండ్ చేశారు.
ఇప్పుడు ఆయన మీద మరో ఆరోపణ వచ్చింది. ఒక చిన్న గొడవ కేసు విషయంలో తనను రూ. ఒక కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న బెంగళూరు నివాసి మల్లికార్టున్ అలియాస్ ఫైటర్ రవి లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వయ్యాలి కావెల్ లో నివాసం ఉంటున్న ఫైటర్ రవిని అనేక కేసులలో పీడించి లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2014 అక్టోబర్ 30వ తేదిన వయ్యాలి కావెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంజ్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫైటర్ రవి, మరొ వ్యక్తికి గొడవ జరిగింది. కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు తెరమరుగు కావాలంటే నువ్వు రూ. ఒక కోటి లంచం ఇవ్వాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. లేదంటే రౌడిషీటర్ జాబితాలో నీ పేరు పెట్టి దొపిడి కేసులు నమోదు చేస్తానని అలోక్ కుమార్ తనను బెదిరించాడని ఫైటర్ రవి ఆరోపిస్తున్నాడు.
ఆ సందర్బంలో కొందరు పోలీసు అధికారులు, మద్యవర్థులు తనకు నిత్యం ఫోన్లు చేశారని రవి అంటున్నాడు. ఫోన్లు చేసిన వారు లంచం ఇవ్వాలని పదేపదే వేదించారని, ఆ మాటలు రికార్డు చేశానని, వారు నేరుగా కలిసిన సమయంలో సీసీ కెమెరాలలో ఆ క్లిప్పింగ్ లు రికార్డు అయ్యాయని చెబుతున్నాడు.
ఆ సాక్ష్యాలను న్యాయస్థానంలో సమర్పిస్తానని ఫైటర్ రవి అంటున్నాడు. కేసు నమోదు చేసిన లోకాయుక్త దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించింది.












Click it and Unblock the Notifications