కేజ్రీవాల్ కు హిస్టిరియా వచ్చినట్లుంది: జైట్లీ
న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద పురుష పదజాలంతో విమర్శలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వం ఎలాంటిదో దేశ ప్రజలు అందరూ చూశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
తాను ఒక ముఖ్యమంత్రి అనే విషయం మరిచిపోయిన కేజ్రీవాల్ హిస్టిరియా వచ్చినట్లుగా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద పురుష పదజాలంతో దూషించిన కేజ్రీవాల్ కు మరో ఇద్దరు ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు.

కేజ్రీవాల్ కు మద్దతు ఇచ్చిన ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వెంటనే కేజ్రీవాల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగా చెప్పాలని సూచించారు. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా వ్యవస్థ స్పూర్థిని దెబ్బతియ్యవా అని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తు ఎదుర్కుంటున్న ఓ ఐఏఎస్ అధికారిని కాపాడటానికి తన మీద అనవసరంగా బురదజల్లుతున్నారని అరుణ్ జైట్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన గదిలో సీబీఐ సోదాలు చెయ్యలేదనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని జైట్లీ సూచించారు.












Click it and Unblock the Notifications