Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడితే కుంభస్థలం కొట్టాలని స్కెచ్, అగ్ర నిర్మాత ఫ్యామిలీకి షాక్, సీసీటీవీల్లో, యూరప్ దెబ్బ !

బెంగళూరు: బెంగళూరు నగరంలో రోజురోజుకు జన సంఖ్య పెరిగిపోతున్నది. కరోనా వైరస్ దెబ్బతో బెంగళూరు సిటీ వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన లక్షలాది మంది మళ్లీ బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే బెంగళూరు సిటీలో ఐటీ, బీటీ సంస్థలతో పాటు కార్పోరేట్ కార్యాలయాలు పూర్తిగా తెరుచుకోవడంతో దాదాపుగా ఉద్యోగులు అందరూ బెంగళూరు చేరుకుని ఆఫీసులకు వెలుతున్నారు.

ఇదే సందర్బంలో బెంగళూరు నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బెంగళూరు నగరంలో గతంలో చోరీలు ఎక్కువ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనుకున్న దొంగలు ఏకంగా కోటీశ్వరుడి ఇంటికి కన్నం వేశారు. నిత్యం సీసీటీవీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులు, ఇంటి పనిమనుషులు ఉండే ఇంటిని లూటీ చేసి జంప్ జిలాని అంటూ వెళ్లిపోయారు.

Five kg gold jewelery looted from house of film producer Rockline Venkateshs brother in Bengaluru

స్యాండిల్ వుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు, తెలుగు, తమిళ బాషల్లో భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత, కన్నడ నటుడు, ప్రముఖ వ్యాపారి రాక్‌లైన్ వెంకటేష్ తమ్ముడి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఏకంగా 5 కిలోలు బంగారు నగలు చోరీకి పాల్పడటం కలకలం రేపింది. తన తమ్ముడి ఇంటిలో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని స్వయంగా ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లేఅవుట్‌లోని రాక్‌లైన్ వెంకటేష్ తమ్ముడి ఇంట్లో చోరీ జరిగింది. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమ్ముడు కుటుంబం సమేతంగా యూరప్ కు విహారయాత్రకు వెళ్లినప్పుడు అతని ఇంట్లో దొంగలు ఎంట్రీ ఇచ్చి చేతివాటం చూపించారని పోలీసులు అంటున్నారు. రాక్ లైన్ వెంకటేష్ తమ్మడు, అతని కుటుంబ సభ్యులు యూరప్ పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి బెంగళూరులోని ఇంటికి తిరిగిరాగా వాళ్ల ఇంట్లో చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Five kg gold jewelery looted from house of film producer Rockline Venkateshs brother in Bengaluru

ఇంట్లో 5 కిలోల బంగారు నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ తమ్ముడి ఇంటిలో పని చేస్తున్న పనిమనుషుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. మహాలక్ష్మి లే అవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒకే ఇంటిలో ఐదు కేజీల బంగారు నగలు చోరీ కావడంతో బెంగళూరు పోలీసులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+