మృతి: వరదల్లో 7గురు, రోడ్డు ప్రమాదం మరో 7గురు

గౌహతి/జైపూర్: అస్సాంలో కురిసిన 15 గంటల ఏడతెరిపిన లేని వర్షానికి రాజధాని గౌహతి తోపాటు నాలుగు జిల్లాల్లో రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
కొండచరియలు విరిగిపడి ముగ్గురు, విద్యుదాఘాతంతో మరో నలుగురు మృత్యువాతపడ్డారు.

గౌహతి నగరంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. అస్సా ముఖ్యమంత్రి తరుణ్ గోగొయ్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు బాధితులకు పునరావా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంటోంది.

Flash Floods in Guwahati, Seven Dead in Last 15 Hours

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జైసల్మేర్ జిల్లాలోని కీటా ఫాంటా ప్రాంతంలో కార్మికులతో ప్రయాణిస్తున్న ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు డిఎస్పి అశోక్ మీనా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+