వైరల్ వీడియో : గంగానదిలో బికినీతో స్నానం చేసిన మహిళ..!

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర రిషికేశ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గంగానదిలో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీ ధరించి స్నానం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మెడలో పూలదండలు వేసుకుని.. గంగానదిలో ఈత కొడుతూ వీడియో తీసుకుంది. ఆ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో భక్తులు.. స్థానికులు, నెటిజన్లలో తీవ్ర చర్చ మొదలైంది. కాగా గతంలో సైతం ఈ తరహా ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

గత ఏడాది రిషికేశ్‌లోని పవిత్ర గంగా ఘాట్‌లో విదేశీయులు బికినీలలో సరదాగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళ్లీ ఇప్పుడు ఇదే రీతిలో ఒక విదేశీ మహిళా స్నానం ఆచరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ వరుస ఘటనలపై రెండు వర్గాలుగా విడిపోయి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో ఈ వీడియోకి వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

foreign-tourist-bathig-in-ganga-river-with-bikini-and-video-got-viral

ఎవరేమంటున్నారంటే..?

ఇక వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం "ఇందులో తప్పేముంది? పురుషులు ఇన్నర్వేర్‌తో స్నానం చేస్తే మహిళ బికినీ వేసుకుంటే ఎందుకు సమస్య?" అని ప్రశ్నిస్తోంది. అది వారి దృష్టిలో వ్యక్తిగత స్వేచ్చకు సంబంధించిన అంశం అని వాదిస్తున్నారు. రిషికేశ్ ఇప్పుడు అంతర్జాతీయ టూరిస్టు స్పాట్‌ గా మారిన తరుణంలో మన సంస్కృతి గురించి అవగాహన లేకపోవచ్చని అంటున్నారు.

కానీ మరోవర్గం మాత్రం ఈ తరహా చర్యను సంప్రదాయాలకు అవమానంగా అభివర్ణిస్తున్నారు. పవిత్ర ప్రదేశాల్లో కనీస గౌరవం పాటించాలని.. సాంస్కృతిక సున్నితత్వాన్ని దెబ్బతీయకూడదని సూచిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ప్రవర్తన ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయం వ్యకట వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ వీడియోపై ఉత్తరాఖండ్ టూరిజం శాఖ దృష్టి సారించింది. పవిత్ర ప్రదేశాల్లో టూరిస్టులు డ్రెస్సు కోడ్‌ పాటించాలని అధికారులు సూచించారు. పోలీసులు కూడా ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా టూరిస్టులకు మార్గదర్శకాలు జారీ చేయాలని పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+