మాజీ సీఎంకు పొగబెట్టింది వారే: బీఎల్ సంతోష్ చుట్టూ వివాదాలు

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. భారతీయ జనతా పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్.. కాంగ్రెస్‌లో చేరారు. బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే- పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.

హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు జగదీష్ షెట్టార్. ఇది ఆయన సొంత నియోజకవర్గం. బీజేపీ అభ్యర్థిగా వరుసగా మూడు ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఆ దఫా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగారు. ఆయనపై మహేష్ తెంగినకాయను పోటీకి నిలబెట్టింది బీజేపీ. వీరిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది వచ్చేనెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.

 blsanthosh

తాజాగా జగదీష్ షెట్టార్ విలేకరులతో మాట్లాడారు. తాను బీజేపీ నుంచి బయటికి రావడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ క్రమంలో హుబ్లీ-ధార్వాడ లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్‌పై నిప్పులు చెరిగారు. తాను బీజేపీ నుంచి బయటికి రావడానికి వారిద్దరే ప్రధాన కారకులని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలను పంపించారని ధ్వజమెత్తారు.

పార్టీలో పొమ్మనలేక పొగబెట్టారని జగదీష్ షెట్టార్ ఆరోపించారు. టికెట్ లేకుండా చేయడం ద్వారా రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని భావించారని విమర్శించారు. ధార్వాడ లోక్‌సభ ఎన్నికల్లో ప్రహ్లాద్ జోషి వరుసగా మూడుసార్లు గెలవడానికి తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ధార్వాడ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రహ్లాద్ జోషికి మెజారిటీ ఓట్లు దక్కడంలో కీలకపాత్ర పోషించానని అన్నారు.

 blsanthosh

అయినప్పటికీ- తన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని ఆయన భావించారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం తనకు టికెట్ దక్కనివ్వకుండా చేశారని విమర్శించారు. బీజేపీ కోర్ కమిటీకి పంపించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉందని, తీరా లిస్ట్ వెలువడే సమయానికి గల్లంతయిందని అన్నారు. దీనికి కారణం బీఎల్ సంతోషేనని పేర్కొన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+