Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు మాజీ సీఎంలు అరెస్టు, అసలు మ్యాటర్ తో షాక్, అధికార పార్టీ, సీఎం డీల్ తో !

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కావేరి (cauvery)నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం బెంగళూరులో (Bengaluru) బీజేపీ (bjp) నిరసన చేపట్టింది. ఈ సమయంలో మైసూరు బ్యాంకు సర్కిల్‌లో కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్‌ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్ తో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Former Karnataka CMs Yeddyurappa, Basavaraj Bommai arrested in Bengaluru

కావేరీ (cauvery)జలాల సమస్యతో పాటు వివిధ అంశాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఖండిస్తూ శనివారం బెంగళూరులోని (Bengaluru) మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, డీవీ సదానందగౌడ్, బీజేపీ (bjp) ఎంపీ పీసీ మోహన్, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్థనారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విధాన పరిషత్ సభ్యులు, బీజేపీకి చెందిన నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దీనిపై మాట్లాడిన మాజీ డీసీఎం గోవింద కారజోల కావేరీ (cauvery)జలాల అంశంతోపాటు వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బెంగళూరులోని (Bengaluru) మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద ఈరోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. తక్షణమే తమిళనాడుకు నీటి సరఫరా నిలిపివేయాలని బీజేపీ (bjp) నాయకులు డిమాండ్‌ చేశారు.

Former Karnataka CMs Yeddyurappa, Basavaraj Bommai arrested in Bengaluru

కావేరి (cauvery) పరివాహక ప్రాంత ప్రజలు నీటి కోసం మోచేతినీళ్లు తాగాల్సిన పరిస్థితి ఎదురైయ్యిందని బీజేపీ (bjp) నాయకులు విచారం వ్యక్తం చేశారు. కర్ణాటక, కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ పీసీ మోహన్ మండిపడ్డారు. తమిళనాడులో మంచి వర్షాలు కురిసినా, కర్ణాటకలో నీరు లేకున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేస్తున్నారని బీజేపీ (bjp) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల కావేరి (cauvery)పోరు తీవ్రరూపం దాల్చడంతో.. ముందుజాగ్రత్త చర్యగా మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడ్యూరప్ప, బసవరాజ్‌ బోమ్మయ్ తో పాటు బీజేపీ (bjp) నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు సీఎం (cm) స్టాలిన్ తో డీల్ మాట్లాడుకున్నారని, ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా కూటమిలో ఈ డీల్ జరిగిందని కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+