మీరు ఏం పొడిచేశారని ప్రధాని మోదీని విమర్శిస్తారు? సీఎంను సూటిగా ప్రశ్నించిన మాజీ ప్రధాని
పొద్దున్నే నిద్ర లేస్తే ప్రధాని నరేంద్ర మోదీని ఏకంగా మోదీ మోదీ అంటారు. మన్మోహన్ సింగ్ గతంలో కర్ణాటకకు ఏం ఇచ్చారు?, ఏం చేశారు ? అని ఆయనే చెప్పాలి. అంతకు ముందు అటల్ బిహారి వాజ్‌పేయి ఏం ఇచ్చారో చెప్పండి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిజాలు మాట్లాడాలని భారత మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవేగౌడ డిమాండ్ చేశారు
నరేంద్ర మోదీ ఈ దేశంలో సమర్థుడైన నాయకుడు కాదని చెప్పడానికి సిద్దరామయ్య ఎవరు ? మోదీ గురించి మాట్లాడటానికి ఆయన ఎవరు? అంటూ సీఎం సిద్దరామయ్యపై మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. ఈ విషయమై మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ మండ్యకు చెందిన ఓ నేత (కర్ణాటక మంత్రి చెలువరాయస్వామి) ఎంతో ఎత్తుకు ఎదిగారని, వారు చాలా చాలా పొడవు పెరిగారని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ వ్యంగంగా అన్నారు.

ఓ ముసలాయన ఏదో చెయ్యాలని అనుకుంటున్నారని, అది జరగదని ఆయన తనను ఉద్దేశించి అంటున్నారని, తన మీద ఏదో ఒక రకంగా ఆరోపణలు చెయ్యాలని అనుకుంటున్నారని, అయితే తనకు ఆత్మగౌరవం ఉందని, మా జేడీఎస్ పార్టీ కావేరి నీటి కోసం పోరాటం చేసింది, ఇప్పుడు చేస్తోందనే విషయం గుర్తు పెట్టుకోవాలని, హేమావతి కట్టింది, హారంగి కట్టింది ఎవరో మీకు తెలుసని, మీరు ఏం కట్టారని మాట్లాడుతున్నారని, ఇన్ని చేసిన తాను ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఉన్నానని, ఇప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కర్ణాటక మంత్రి చెలువరాయస్వామిపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ విరుచుకుపడ్డారు.
ఏదైనా పనిని అప్పగించడానికి, పనులు చెయ్యడానికి ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిన సమయంలో తాను ఐదు పైసలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం సిద్ధరామయ్య ఇటీవల ప్రతిపక్షాలకు సవాలు చేశారు. 5 పైసల లంచం అంటే ఎక్కడైనా ముఖ్యమంత్రి పదవికి గౌరవం వస్తుందా?, సీఎం సిద్దరామయ్య లూటీ చేస్తున్నారని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఆరోపించారు.
సీఎం సిద్దరామయ్య ఇటీవల నీటిపారుదల శాఖ కార్యదర్శిని నియమించారని, నేను ఆయనకు ఫోన్ చేశానని, కానీ ఆయన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోలేదని, నేను ఈ దేశంలో చిన్న రాజకీయ నాయకుడు అని పాపం ఆ సెక్రటరీ అనుకున్నాడని, ఫోన్ ఎత్తడానికి కూడా ఆయనకు టైమ్ లేదని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఎద్దేవ చేశారు. ఆ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎవరని తాను తనకు తెలిసిన వాళ్లను అడిగితే ఆయన సిద్ధరామయ్య బంధువని చెప్పలేదని, సిద్ధరామయ్య కులానికి చెందిన అధికారి అని చెప్పారని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ అన్నారు.

అంత సీనియర్ పోస్టుకు అతి చిన్న వయసులో ఉండే అధికారి పని చెయ్యగలడా, నీటి పారుదల శాఖ కార్యదర్శిగా ఆయన్ను ఎందుకు నియమించారు ? అని సీఎం సిద్దరామయ్యను మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు మేము బీజేపీలో చేరామని ఆరోపిస్తున్నారు, అయితే గతంలో కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? ఏ కారణంతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు అని చెప్పాలని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ డిమాండ్ చేశారు.
జేడీఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలని సిద్ధరామయ్య స్వయంగా నిర్ణయించారు, అలా చెప్పడానికి ఆయన ఎవరని, సిద్ధరామయ్య మోదీకి పోటీగా సమర్థుడైన నాయకుడు అని మండ్యకు చెందిన ఓ నాయకుడు అన్నారు. సెక్యులర్ అనే పదాన్ని వాడే నైతికత జేడీఎస్‌కు లేదని కాంగ్రెస్ ఆరోపించింది, అయితే ముస్లింలకు నేను కల్పించిన 4% రిజర్వేషన్లను వీళ్లను మళ్లీ ఇవ్వాలని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ సీఎం సిద్దరామయ్యకు సవాల్ విసిరారు.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications