కాశ్మీర్ లో నలుగురు పాక్ మిలిటెంట్లు హతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లో వరుసగా మిలిటెంట్లను అంతం చేస్తున్నారు. మిలిటెంట్లు తలదాచుకున్నారని సమాచారం ఇవ్వడంతో సైన్యం, పోలీసులు, పారా బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 9 గంటల పాటు ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
గురువారం జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలోని సోచల్ వారీ గ్రామంలో మిలిటెంట్లు తలదాచుకున్నారని సైనికులకు సమాచారం అందింది.
వెంటనే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందిన పోలీసులు, సైనికులు, పారా బలగాలు సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో విషయం పసిగట్టిన మిలిటెంట్లు పోలీసులు, సైనికుల మీద కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు, సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. ఆ సందర్బంలో నలుగురు మిలిటెంట్లతో సహ ఓ సైనికుడు మరణించాడు. గురువారం వేకువ జామున వరకు ఈ ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. గత వారం పాకిస్థాన్ కు చెందిన హిజబుల్ ముజాహుద్దిన్ ఉగ్రవాది సాజద్ హుస్సేనీని సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేశారు.
సాజద్ హుస్సేనీ ఇచ్చిన సమాచారం మేరకు సైనికులు మిలిటెంట్లను అంతం చేశారని తెలిసింది. అయితే ఇంకా ఎంత మంది పాక్ మిలిటెంట్లు జమ్మూ కాశ్మీర్ లో తలదాచుకున్నారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications