యువతికి చుక్కలు చూపించిన Ola బైక్ రైడర్.. ఏమైందంటే..?
రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఓ యువతి తన ఓలా రైడ్ అనుభవాన్ని సామజిక మాధ్యమంలో పంచుకుంది. బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో బైక్ రైడర్ తో పాటు కిలోమీటరు వరకు నడిచానని తెలిపింది. అంతేకాక రూట్ మారినందుకు నా వద్ద అదనపు ఛార్జీ వసూలు చేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తన లింక్ డిన్ ఖాతాలో పోస్టు చేసింది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఆయుషి గుప్తా.. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేందుకు ఓలా బైక్ బుక్ చేసుకుంది. అయితే జర్నీ మధ్యలో బైక్ లో పెట్రోల్ అయిపోయిన కారణంగా రైడర్ బండి ఆపేశాడు. అయితే ఆ సమయంలో తన వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయని ఆ పోస్టులో పేర్కొంది ఆయుషి గుప్తా .. ఒకటి.. అక్కడితో రైడ్ ఎండ్ చేసి వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్లిపోవడం.. రెండూ.. ఆ సమయంలో డ్రైవర్ కు అండగా ఉండి సమీప పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లడం.. అయితే ఈ రెండింటిలో రెండో దాన్ని ఎంచుకున్నట్లు ఆయుషి గుప్తా చెప్పుకొచ్చింది.
A Jaipur-based woman narrated her Ola bike ride experience that turned into a lesson in empathy after she accompanied the driver to refuel his vehicle, arrived late, and still paid an extra charge for the detour.
— IndiaToday (@IndiaToday) November 3, 2025
Read in detail: https://t.co/XU0YDmyUWk#Jaipur #BikeService… pic.twitter.com/zdhEFFumBF
"మేము దాదాపు 1 కిలోమీటర్ వరకు బైక్ ను నెట్టుకుంటూ వెళ్లాం.. దాంతో నేను గమ్యానికి చేరుకోవాల్సిన సమయం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటలు అయింది. కానీ ఆ సమయంలో డ్రైవర్ ను అలా వదిలేయడం కష్టంగా అనిపించింది. నాకు కనీసం ఈవెనింగ్ వాకింగ్ అవుతుంది అని వెళ్లాను. పెట్రోల్ కొట్టించాడు. ఆ తర్వాత నన్ను ఇంటి వద్ద దింపాడు. నేను అతనికి రూ. 101 చెల్లించాను. అయితే ఆ రైడర్ మళ్లీ పిలిచాడు. మేడం రూ.7 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పెట్రోల్ బంక్ వరకు బండి వెళ్లిందని చెప్పాడు. నేను కన్ ఫ్యూజ్ అయ్యాను. మొత్తానికి మరో రూ. 7 ఇచ్చి ఇంట్లోకి వెళ్లాను" అని ఆయుషి గుప్తా చెప్పుకొచ్చింది.

"అయితే నేను మా అమ్మ ముందుకు వెళ్లి ఏడ్చాను. రూ. 7 అదనంగా తీసుకున్నందుకు కాదు.. ఆ సమయంలో రైడర్ కు అండగా పెట్రోల్ బంక్ వరకు నడిచాను. కానీ నాకు ఎంపతీ కనబడలేదని వాపోయాను. కానీ మా బ్రదర్ నా వైపు చూసి నవ్వాడు. ఇందులో అప్ సెట్ అవ్వడానికి ఏం ఉంది అన్నాడు. కానీ అమ్మ మాత్రం.. సొంత కష్టాల్లో ఉన్నవాళ్లు ఎదుటివారి దయా హృదయాన్ని గుర్తించలేరని తెలిపింది" అని ఆయుషి గుప్తా తనకు జరిగిన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంది. దీనిపై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications