రాముడు, ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్నాయి, త్వరలో ఎంట్రీ ఇస్తా, గాలి జనార్దన్ రెడ్డి
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరిగిందని, శ్రీరాముడు, ఆంజనేయుడి ఆశ్వీరాదం తనకు ఉందని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. హమంతుడి ఆశీస్సులతో త్వరలో తాను మళ్లీ బళ్లారిలో కాలు పెడుతానని, ఆ రోజులు త్వరలోనే వస్తాయని తాను అనుకుంటున్నానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతిలోని అంజనాద్రిలో సోమవారం హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం సంతోషంగా ఉందని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట శుభకార్యం చాలా ఘనంగా జరగడంతో ముందుగా సంతోషించింది హనుమంతుడే అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

హనుమంత పుట్టింది కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో అని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నిర్వహించారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయోధ్యలో శ్రీరాముడికి, అంజనాద్రికి ఏకకాలంలో మహామంగళరాతి జరగడం శుభపరిణామం అని గాలి జనార్దన రెడ్డి అన్నారు. రామభక్తి అంటే దేశభక్తి అని, దేశ ప్రజలందరితో కలిసి హనుమంతుడు కూడా చాలా సంతోషించాడని, అదే సమయంలో ఇక్కడి అంజనాద్రిలో ఘనంగా పూజలు జరుపుకున్నామని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

అయోధ్యను అభివృద్ధి చేసినట్లే అంజనాద్రి అభివృద్ధి చేస్తామాని, ఆంజనేయుడిని నిత్యం ఆరాదిస్తామని, అంజనాద్రికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమంతుని సేవ కంటే గొప్ప తనకు గొప్ప డిగ్రీ లేదని, భగవంతుని సేవించే శక్తిని ఇవ్వాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.
హనుమంతుడు కలియుగంలో మన మధ్య సజీవంగా ఉండే దేవుడు అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల పూజ సమయానికి గంగావతి నియోజక వర్గం నుంచి తుంగభద్ర నీటిని తీసుకుంటామని, బంగారు పూత పూసిన 108 కలశాలలో ఆ నీటిని తీసుకుంటామని, నేను ప్రత్యేకంగా రైలు మొత్తం బుక్ చేసుకుని అయోధ్యకు ఇక్కడి ప్రజలను తీసుకు వెలుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.
గంగావతి తాలూకాలోని ఆంజనేయడి కొండపైకి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడంతో సాధువులు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. అయోధ్యలో శ్రీరామ మూర్తి ప్రతిష్ఠాపన సందర్భంగా అంజనాద్రిలో దీపోత్సవం జరిగింది. అంజనాద్రిలోని 575 మెట్లను ప్రత్యేక దీపాలు, కర్పూరంతో వెలిగించి వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉండగా అంజనాద్రిలోని ఆంజనేయుడి ఆలయాన్ని ప్రత్యేక పూలతో చూడముచ్చటగా చాలా ఘనంగా అలంకరించారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications