కుర్చీకి కట్టేసి అక్క కళ్ల ముందే చెల్లెలిపై గ్యాంగ్‌రేప్

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సారన్ జిల్లాలోని గోవింద్చక్ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలిక(16) ఆదివారం రాత్రి తన అక్కతో పాటు నిద్రిస్తోంది. అదే సమయంలో వారింట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు.. వివాహిత మహిళ అయిన బాలిక అక్కను తాళ్లతో కుర్చీకి కట్టివేశారు.
అనంతరం ఆమె కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి అక్కడ మెడలోని మంగళసూత్రం, ఇతర ఆభరణాలు, ఇంట్లోని నగదును తీసుకుని పరారయ్యారు.
ఘటన జరిగిన సమయంలో అక్క చెల్లెళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. నర్సుగా విధులు నిర్వహిస్తున్న వారి తల్లి ఆస్పత్రికి వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications