దమ్ముంటే రెఫరెండం నిర్వహించండి.. మమతా సవాల్
ఎన్‌ఆర్‌సీ దుమారం కేంద్రం ఉహించని విధంగా మలుపు తిరుగుతోంది. దేశంలోని ముస్లిం మైనారీటీ వర్గాలతో పాటు కాంగ్రెస్ ఇతర వాపపక్ష పార్టీలు , విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ముందుగా నిరసనలు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితం అవుతాయని అనుకున్నా ... రానురాను అవి ఇతర రాష్ట్రాలకు కూడ పాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలోనే బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ... ఆమె కోల్‌కతా నిర్వహించిన ర్యాలీలో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా కేంద్రప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. మెజారీటి ఉందని బీజేపీ ఇష్టం వచ్చినట్టు చేస్తే... చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి అధ్యర్యంలో లేదా మానవహక్కుల కమీషన్ తో ఎన్ఆర్‌సీతోపాటు సిటిజన్ చట్టంపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రిఫరెండంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తే... ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మమతాబెనర్జీ సవాల్ విసిరారు.

నిరసలను శుక్రవారం కూడ కొనసాగించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ప్రజలు నిరసనలో సంయమనం పాటించాలని కోరారు. కాగా ఈ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరాటంగా తీర్చీదిద్దేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని , ప్రజలెవరు బీజేపీ ట్రాప్‌లో పడద్దని కోరారు. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం మీద బీజేపీ దాడులు చేయనున్నట్టు తమవద్ద సమాచారం ఉందని ఆమె తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications