పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్‌మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఓటర్లు బారులు తీరిన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. గ్రనేడ్ల దాడిలో ప్రాణానష్టం ఏమైనా సంభవించిందా? లేదా? అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా అయిదో విడత పోలింగ్ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కోసం సోమవారం ఉదయం పోలింగ్ ఆరంభమైంది. ఇందులో భాగంగా- రోహ్‌మూ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉగ్రవాదుల దాడి చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ పోలింగ్ కేంద్రాన్ని అత్యంత సున్నితమైనదిగా గుర్తించారు ఎన్నికల అధికారులు. దీనికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ఆర్మీ, పోలీసుల బలగాలను మోహరింపజేశారు.

పోలింగ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందే- భారీ ఎత్తున తనిఖీలను నిర్వహించారు. ప్రతి వాహనాన్నీ సోదా చేశారు. అయినప్పటికీ- గ్రనేడ్ దాడి చోటు చేసుకుంది. మిలిటెంట్లు ఈ పోలింగ్ కేంద్రంపై రెండు గ్రనేడ్లు విసరగా.. అందులో ఒకటి పేలలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అదనపు పోలీసు, ఆర్మీ బలగాలను రోహ్‌మూ పోలింగ్ కేంద్రానికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహూతి దాడికి పాల్పడినది పుల్వామా జిల్లాలోనే. జిల్లాలోని అవంతిపురా వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications