మిల్లెట్స్ పిండిపై జీఎస్టీ భారీగా తగ్గింపు, వీటిపైనా
న్యూఢిల్లీ: మిల్లెట్ల పిండిపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంతకుముందు దీనిపై జీఎస్టీ 18 శాతంగా ఉండేది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ నిర్ణయాలను వెల్లడించారు.
కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే.. ఎలాంటి జీఎస్టీ వర్తించదని చెప్పారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమావేశంలో మొలాసిస్‌పై జీఎస్టీని తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొలాసిస్‌పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. దాన్ని 5 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించింది కౌన్సిల్.

దీని వల్ల చెరకు రైతులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల గరిష్ట్ వయసును నిర్ణయించారు. ఇకపై జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ అధ్యక్షుడి గరిష్ట వయసు 70 ఏళ్లు, సభ్యుల వయస్సు 67 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వయో పరిమితి అధ్యక్షులకు 67, సభ్యులకు 65గా ఉంది.
కాగా, గతంలో జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ పొడి మిల్టెట్ ఉత్పత్తులపై పన్ను మినహాయింపును సిఫార్సు చేసింది. భారత్ 2023ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అధిక పోషక విలువలున్న చిరు ధాన్యాల పొడి ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా జీఎస్టీ మినహాయింపు, తగ్గింపులను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications