సుత్తి దెబ్బకు నొప్పి మాయం: బాబా షాకింగ్ ట్రీట్‌మెంట్.. (వీడియో)
సుత్తి తీసుకుని ఎడా పెడా వెన్నుపూస మీద బాదితే నొప్పి దానికదే మాయం అవుతుందట.
ముంబై: డాక్టర్ల కన్నా బాబాలను ఆశ్రయిస్తేనే రోగాలు, నొప్పులు నయం అవుతాయన్న భ్రమలో ఇప్పటికీ చాలామంది వారినే ఆశ్రయిస్తున్న పరిస్థితి దేశంలో నెలకొంది. వీరి మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకోని దేశంలో కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు.
తాజాగా మహారాష్ట్రలో ఓ కొత్త బాబా వెలిశాడు. సుత్తితో వెన్నుపూస మీద బాదుతూ నడుం నొప్పిని మాయం చేయడం ఈయన గారి ప్రత్యేకత. నొప్పి ఎంతవరకు తగ్గుతుందో తెలియదు కానీ.. సుత్తి తీసుకుని ఎడా పెడా అతను బాదుతున్న తీరు చూస్తుంటే.. లేని నొప్పి కూడా పుట్టుకొస్తుందేమోనన్న అనుమానం కలగకమానదు.
నిత్యం కొన్ని వందల మంది జనం ఈయన వద్దకు వస్తుంటారు. అయితే ఈ బాబాకు సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంతవరకు తెలియరాలేదు. నొప్పి తగ్గించడం కోసం బాబా సుత్తితో కొడుతున్న వీడియో మాత్రం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
పుణెకు చెందిన ఓ ఇంటర్వ్యూలో డా.సత్యశీల్ దీనిపై స్పందించారు. ఈ తరహా నాటు వైద్యం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా నాటు వైద్యం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications