75 శాతం ఉద్యోగాలు స్థానికులకే: కీలక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం, ప్రతిపక్షాలు గుస్సా...
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మెజార్టీ ప్రైవేట్ సెక్టార్ కొలువులు స్థానికులకే ఇస్తామని స్పష్టంచేసింది. ప్రైవేట్ కొలువుల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. అయితే బీజేపీ భాగస్వామ్యంలో గల జేజేపీ దీనిని వ్యతిరేకించడం విశేషం.

స్థానికులకే అని చెప్పి
స్థానికులకే కొలువులు ఇస్తామని 2019 ఎన్నికల్లో జేజేపీ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు, సొసైటీలు, ట్రస్ట్, భాగస్వామ్య సంస్థలు తదితర వాటిల్లో లోకల్స్‌కు అవకాశం ఇస్తామని పేర్కొన్నది. బీజేపీ సర్కార్ హర్యానా స్టేట్ ఎంప్లాయీమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిటెట్స్ బిల్-2020 ప్రవేశపెట్టి ఆమోదించింది.

సరికాదు..
హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై కంపెనీలు పెదవి విరుస్తున్నాయి. దీంతో తమ పోటీ తత్వం తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. హర్యానాకు పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇదివరకు ఉన్న ఉపాధి కల్పన బాగుందని చెప్పారు.

ఏ జిల్లాలో అయినా సరే..
బిల్లు ప్రకారం ప్రతీ కంపెనీ తమ సంస్థలో 75 శాతం మంది స్థానికులకు ఉపాధి కల్పించాలి. వారు హర్యానాలోని ఏ జిల్లాకు చెందినవారైనా సరేనని తెలిపింది. రూ.50 వేలు, అంతకన్నా తక్కువ జీతంతో ఉపాధి కల్పించారు. దీనిని జేజేపీ ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్ ఖండించారు. దేశం ప్రతీ ఒక్కరిదీ అని.. ఎందుకీ పక్షపాతం అన్నారు. పంటల కోసం బీహరీలు మన వద్దకు, హర్యానాకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని తెలిపారు. కానీ సర్కార్ తీసుకొచ్చిన చట్టం బాగోలేదన్నారు.

మరీ అక్కడ..
మరో రోజు మన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళితే పరిస్థితి ఏంటీ అని అడిగారు. అక్కడ వారిని పనిచేయకుంటే ఏం చేయాలన్నారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. కానీ అధికార పక్షం పట్టించుకోలేదు. తమకు 90 మంది సభ్యుల బలం ఉంది అని ప్రవేశపెట్టి.. ఆమోదింపజేసుకుంది. ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications