సెక్స్ స్కాండల్.. ఎయిర్ పోర్టులో ప్రజ్వల్ అరెస్టు.. నిమిషం కూడా టైమ్ ఇవ్వని సిట్ టీమ్ !
పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మే 31వ తేదీన అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జర్మనీ నుంచి బెంగుళూరుకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సిట్ అధికారులు ఆయన్ను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసింది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసి విచారణ కోసం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లింది.
ఏప్రిల్ 27వతేదీన జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ.. మే 31వ తేదీన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం డీఎల్‌హెచ్ 764 ఏ-359లో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రంలో దిగారు. సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు ఎయిర్ పోర్టులోనే ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు చేశారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ పారిపోయినప్పటి నుంచి ఆయన కోసం సిట్ అధికారులు గాలిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

గత ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైనప్పుడు, హాసన్ జిల్లాలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లో వీధుల్లో విసిరేశారని చెబుతున్నారు. వీటిలో సుమారు రెండు వేల మందికి పైగా మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారం వైరల్‌గా మారింది.
ముఖ్యంగా ప్రజ్వల్ రేవణ్ణ తప్పించుకున్న తర్వాత సిట్ ఆయన కోసం గాలించింది. కర్ణాటక రాష్ట్రంలో లోక్‌సభ ఎన్ననికల తొలి దశ పోలింగ్ ముగియడంతో ప్రజ్బల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ అశ్లీల వీడియో కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు ఏడీజీపీ బిజయకుమార్ సింగ్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుమన్ డి. పన్నెకర్, మైసూర్ ఎస్పీ సీమా లఠ్కర్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది.
#WATCH | Karnataka: Suspended JD(S) leader Prajwal Revanna, who is facing sexual abuse charges was brought to the CID office, in Bengaluru.
— ANI (@ANI) May 30, 2024
He has been arrested by SIT and is likely to be brought to the government hospital for medical examination. pic.twitter.com/ndKZghNpvD
ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన సిట్ మొదటి సారి నోటీసు జారీ చేసింది. మే 1వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణ సిట్ ఎదుట హాజరు కావడానికి ఆయన తరపు న్యాయవాది 7 రోజుల సమయం కోరారు. మే 2వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టుకు లుకౌట్ నోటీసు జారీ చేసిన సిట్ ఆయన్ను పట్టుకోవడానికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల సహాయం కోరింది. ప్రజ్వల్ రేవణ్ణ పాస్ పోర్టు రద్దు చెయ్యలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసింది.
అప్పటి నుంచి ప్రజ్వల్ కోసం సిట్ అధికారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చివరికి విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ గురువారం అర్దరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ఆయన్ను అరెస్టు చేసి విచారణకోసం తీసుకెళ్లారు. సిట్ విచారణలో ప్రజ్వల్ రేవణ్ణ ఏం సమాచారం బయటకు చెబుతాడో అని కర్ణాటక ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications