అరుణ్ జైట్లీ ఎఫెక్ట్: కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్, జరిమానా

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి షాక్ తగిలింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువు నష్టం దావా కేసులో గడువులోగా సమాధానం ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి షాక్ తగిలింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువు నష్టం దావా కేసులో గడువులోగా సమాధానం ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారు.

దీంతో ఆయనకు ఢిల్లీ హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. అంతకుముందు ఇదే కేసులో రూ.10వేలు కేజ్రీవాల్‌ జరిమానాగా చెల్లించారు. తాజా మొత్తాన్ని యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం ఉద్దేశించిన సంక్షేమ నిధిలో జమ చేయాలని కోర్టు రిజిస్ట్రార్‌ పంకజ్‌ గుప్తా సూచించారు.

HC levies fine of Rs. 5000 on Kejriwal for delay in filing reply

జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఆయన తరఫు న్యాయవాది మాణిక్‌ డోగ్రా సోమవారం కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు విధించిన గడువులోగా సమాధానం ఇవ్వడంలో కేజ్రీవాల్‌ విఫలమయ్యారన్నారు.

ఆయనకు జులై 26లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఆలస్యం చేయడం ముఖ్యమంత్రి వ్యూహంలో భాగమని పేర్కొన్నారు. దీంతో కోర్టు జరిమానా విధించింది. తదుపరి విచారణనను అక్టోబర్‌ 12కు వాయిదా వేసింది.

డిడిసిఎ కేసులో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై జైట్లీ రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఆ కేసు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ అభ్యంతకర పదాలు ఉపయోగించారని ఆయన మరోసారి రూ.10కోట్ల పరువు నష్టం దావా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+