ఫీజు చెల్లించలేదని పేషెంట్ నిర్బంధం: హైకోర్టు ఆగ్రహం

ముంబైకి చెందిన సంజయ్ ప్రజాపతి తన తమ్ముడికి తలకు తీవ్రమైన గాయం కావడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే చికిత్స సరిగా అందడం లేదని అతడు భావించాడు. దీంతో వేరే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆస్పత్రి అధికారులు రూ. 4.56 లక్షలు చెల్లించమన్నారు.
కాగా, అందులో ప్రజాపతి ఇప్పటికే 2.76 లక్షలు చెల్లించాడు. మిగితా మొత్తం విషయంలో తనకు అభ్యంతరాలున్నాయని చెప్పాడు. ఆ మొత్తం చెల్లిస్తేనే తప్ప రోగిని డిశ్చార్జ్ చేసేది లేదని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో చేసేదేమి లేక ప్రజాపతి హై కోర్టును ఆశ్రయించాడు.
వాదనలు విన్న హైకోర్టు ఆస్పత్రి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్పత్రి సిబ్బంది, అధికారులు రోగులను ఈ విధంగా అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని న్యాయూమర్తి అన్నారు. ఈ చర్య అమానుషమైనదిగా ఆయన పేర్కొన్నారు. రోగిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications