సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
లోక్‌సభ ఎన్నికల తేదీలను ఇప్పటికే ప్రకటించగా చాలా మంది నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గాలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలను ప్రత్యర్థి పార్టీల నాయకులు తిప్పికొడుతున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందని మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి లింకు పెడుతూ జేడీఎస్ దళపతి, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భయంకరమైన భవిష్యత్తు ఉందని, ఆ భయకరమైన నిజం తెలుసుకునేలోపు సీఎం సిద్దరామయ్య పదవి ఊడిపోతుందని జోస్యం చెప్పారు. మాజీ సీఎం కుమారస్వామి చెప్పిన ఆ భవిష్యత్తు ఏమిటో అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ సొంత బలంతో అధికారంలోకి రాలేదన్నారు. అనుకోకుండా అధికారంలోకి వచ్చారని, ఇదే ఏడాది డిసెంబర్ నాటికి సిద్దరామయ్య ప్రభుత్వం పడిపోతుందని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజం అవుతుందో లేదో మీరే చూడాలని కుమారస్వామి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మండ్యలో జరిగిన బీజేపీ-జేడీఎస్ నేతల సమన్వయ సమావేశంలో మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, జేడీఎస్ మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరగడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి రాగలిగిందని, మా రెండు పార్టీలు ఓట్లు చీల్చుకుంటే మధ్యలో కాంగ్రెస్ లాభపడిందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలో మొత్తం 28 నియోజకవర్గాల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, అందులో ఎలాంట అనుమానం లేదని మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి అన్నారు.

2024లో బీజేపీ, జేడీఎస్ మధ్య సహజమైన పొత్తు కొనసాగుతుందని, గతంలో మనం (బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం) ఒక్కటిగా కలిసి ఇచ్చిన 20 నెలల పరిపాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ తనకు మద్దతు ఇచ్చిన తర్వాత మేము కాంగ్రెస్‌కు అధికారం అప్పగించలేదని నాపై దుష్ప్రచారం చేశారు. తప్పు చేయని తనను కాంగ్రెస్ నాయకులు బలిపశువును చేశారని, అప్పటి నుంచి 17 ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉన్నానని, జేడీఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఒంటరిగా పోరాడానని, కానీ తాను అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదని మాజీ సీఎం కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.
మండ్య కార్యకర్తలు, నాయకుల పట్టుబట్టి మండ్య నుంచి తనను ఎంపీగా పోటీ చేయిస్తున్నారని, మండ్యలో జరుగుతున్నది ధర్మయుద్ధమని, అందులో విజయం మనదే అని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇదే ఏడాది డిసెంబర్ లోపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని మాజీ సీఎం హెచ్ డీ కూరస్వామి చెప్పిన జోస్యం నిజమవుతుందా? లేదా ? అని వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications