పెద్దనాన్న కూతురిలో లవ్, కాలేజ్ అబ్బాయిని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి !
బెంగళూరు/చామరాజనగర: కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కోపంతో బంధువుల అబ్బాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. దాదాపుగా కాలిపోయిన కాలేజ్ అబ్బాయి ఇప్పుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. వరుసకు పెద్ద నాన్న కుమార్తెను కాలేజ్ అబ్బాయి ప్రేమించడంతో అతన్ని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర 12వ క్రామస్లో రంగనాథ్, ప్రేమా దంపతులు నివాసం ఉంటున్నారు. రంగనాథ్: ప్రేమా దంపతుల కుమారుడు శశాంక్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్ఆర్ నగర్ లోని ఓ ఫేమస్ కాలేజ్ లో చదువుతున్న శశాంక్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. చామరాజనగర జిల్లాలోని హరదనహళ్లి ప్రాంతంలో శశాంక్ కు వరుసకు పెద్దనాన్న అయ్యే మను నివాసం ఉంటున్నాడు.

మను కుమార్తె లహరి, శశాంక్ ప్రేమించుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నా చెల్లెలు అవుతారు. ఇద్దరిది ఒకే వయసు కావడంతో ప్రేమించుకున్నారు. కూతురు లహరి లవ్ మ్యాటర్ తెలుసుకున్న ఆమె తండ్రి మను శశాంక్ ను హెచ్చరించాడు. మీరు వరుసకు అన్నాచెల్లెలు అవుతారని, మీరు ఎలా ప్రేమించుకుంటారని మను శశాంక్ కు బుద్దిమాటలు చెప్పాడు.
అయితే కాలేజ్ లో చదువుతూ యవ్వనంలో ఉన్న శశాంక్ ఎవ్వరి మాట వినకుండా అతని పెద్దనాన్న కుమార్తె లహరితో తిరగడం మొదలుపెట్టాడు, తన కూతురు లహరికి దూరం కాకపోతే నిన్ను చంపేస్తానని మను అతని తమ్ముడు కుమారుడు శశాంక్ ను హెచ్చరించాడు, అయితే శశాంక్ మాత్రం పట్టించుకోలేదు.
ఇటీవల శశాంక్ కాలేజ్ కు వెళ్లాడు. అయితే కాలేజ్ కు సెలవు ప్రకటించడంతో శశాంక్ ఇంటికి బయలుదేరాడు, మార్గం మధ్యలో ఆర్ఆర్ నగర్ లోని మెడికల్ కాలేజ్ దగ్గర వెలుతున్న శశాంక్ ను అతని పెద్దనాన్న మనుతో పాటు మరో ఆరు మంది కలిసి ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. శశాంక్ కాళ్లు చేతులు కట్టేసి అతని నోటిలో బట్టలు కుక్కి కళ్లకు గంతలు కట్టేశారు.

శశాంక్ ను మైసూరు రోడ్డులోని కణిమిటిక్ టోల్ గేట్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లి అక్కడ అతన్ని చితకబాదేశారు. ఎంత చెప్పినా బుద్ది మార్చుకోవా అంటూ శశాంక్ మీద పెట్రోల్ పోసిన మను అతనికి నిప్పంటించి అక్కడి నుంచి కారులో పరారైనారు. తీవ్రగాయాలైన శశాంక్ అతని బంధువు హీరో అనే మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. హీరోతో పాటు ఆమె బంధువులు వెళ్లి శశాంక్ ను రక్షించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
శశాంక్ జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చామరాజనగర్ లోని మను ఇంటికి వెళ్లారు. అయితే శశాంక్ ను చంపడానికి ప్రయత్నించిన మను అతని కుటుంబ సభ్యులు ఆరు మందితో కలిసి ఇంటికి తాళం వేసి ఊరు వదిలి వెళ్లిపోయాడని పోలీసులు అంటున్నారు. కూతుర్ని ప్రేమిస్తున్న శశాంక్ ను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించిన మను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఊరు ఖాళీ చేసి పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications