ముంబైలో భారీ వర్షాలు.. 14 విమానాలు దారి మళ్లింపు.. పలు రైళ్లు రద్దు..
ఇటీవలే రెండు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(సెప్టెంబర్25) ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ముంబై ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ నదులన్నీ తలపిస్తున్నాయి. దీంతో ముంబైమీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు ముంబై విమానాశ్రయానికి వచ్చే పలు విమానాలను దారి మళ్లించారు.
వరదల్లో చిక్కుకుని నలుగురి మృతి..
ఇదిలా ఉండగా, ముంబైలో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. దీంతో బృహణ్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించేశారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని ముంబై పోలీసులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల్లో చిక్కుకుని నలుగురు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.

నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాదారులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముంబై విమానశ్రయానికి వచ్చే 14 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను కూడా రద్దు చేశారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27తేదీల్లో మహారాష్ట్రలోని పాల్ఘర్, థానే, రాయ్ గఢ్ జిల్లాల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications