ACB: హైకోర్టు సంచలన తీర్పు, ఏసీబీ రద్దు, లోకాయుక్తకు కొండంతబలం, మాజీ సీఎంకు షాక్ !

బెంగళూరు: అవినీతి నిరోదక శాఖ (ACB)ని రద్దు చేస్తున్నామని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఏసీబీని రద్దు చేసి లోకాయుక్తకు మరన్ని అధికారులు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం (కాంగ్రెస్) అధికారంలో ఉన్న సమయంలో ఏసీబీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల మీద పంజా విసురుతూ వస్తున్నారు. అయితే గురువారం ఏసీబీని రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో సిద్దరామయ్యతో పాటు ఏసీబీని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారని తెలిసింది.

 సిద్దరామయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ?

సిద్దరామయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ?

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం (కాంగ్రెస్) అధికారంలో ఉన్న సమయంలో ఏసీబీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల మీద పంజా విసురుతూ వస్తున్నారు. అయితే లోకాయుక్త అధికారుల విధులు అడ్డుకోవడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఏసీబీని రద్దు చెయ్యాలని అప్పట్లో కర్ణాటక హైకోర్టులో పిల్ దాఖలు అయ్యాయి.

 హైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

ఏసీబీని రద్దు చెయ్యాలని దాఖలు అయిన అర్జీల విచార జరుగుతోంది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. వీరప్ప, జస్టిస్ హేమలేఖ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ ఏసీబీని రద్దు చేస్తూ సంచలన తీర్పు చెప్పారు. ఏసీబీని రద్దు చేసి లోకాయుక్తకు మరన్ని అధికారులు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

 సిద్దరామయ్య ఆశలు అడియాసలు

సిద్దరామయ్య ఆశలు అడియాసలు

కర్ణాటకలో హైకోర్టు ఆదేశాలతో ఇంతకాలం ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న అన్ని కేసులు లోకాయుక్త అధికారుల చేతికి వెళ్లిపోతున్నాయి. కర్ణాటకలో లోకాయుక్త ఎంతో పవర్ ఫుల్ అని కొత్తగా చెప్పనవసరం లేదు. ఏసీబీని రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో సిద్దరామయ్యతో పాటు ఏసీబీని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+