రూ.30 వేల నుంచి రూ.40 వేలు, ఒక్కో రాత్రి హోటల్ గది ఛార్జీ, ఎక్కడ అంటే
బెంగళూరులో కురిసిన వర్షాలతో జనం ఇబ్బందులు మాములుగా ఉండటం లేవు. భారీ వృక్షాలు నేలరాలడం, కొన్ని చోట్ల పవర్ కట్ అవడంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే హోటల్ గదుల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అవును ఒక్కో గది అద్దె దాదాపు రెండింతలు అవుతుంది. గల్లీల్లోకి నీరు రావడంతో.. ప్రజలు విధిగా హోటల్‌లో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ సమయంలో.. డిమాండ్‌ను నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు.

రూ.30 వేల నుంచి..
ఎయిర్ పోర్టు రోడ్డులో గల ఎల్బీ శాస్త్రీ నగర్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంచినీటి సరఫరా కూడా బంద్ చేశారు. వరద నీటితో ఇవ్వడం కష్టం అవుతుంది. దీంతో హోటల్ గదుల్లో ఆ ప్రాంతంలో గల జనం ఉండాల్సిన సిచుయేషన్ వచ్చింది. కానీ అదీ హోటల్ నిర్వాహకులకు వరంగా మారింది. దీంతో ఒక్కో రాత్రి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకుంటున్నారు.

ఇక్కడ ఎఫెక్ట్
వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్, కోరమంగళలో గల హోటల్స్ శుక్రవారం వరకు నిండిపోయాయి. లీలా ప్యాలెస్ హోటల్ గది రూ.18 వేల 113 నుంచి స్టార్ట్ అవుతుంది. పన్ను కాకుండా తాజ్ బెంగళూరులో గది రూ.14 వేల 750 తీసుకుంటున్నారు. ఇక ఓయోలో మాత్రం కాస్త తక్కువగానే ధరకు గదులు దొరుకుతున్నాయి. మిగతా చోట్ల ధర ఎక్కువే ఉంది. స్టార్ హోటళ్ల సంగతి చెప్పక్కర్లేదు.

ఓయోలో తక్కువే..
రూ.1200.. అంతకన్నా ఎక్కువకు గదులను ఇస్తున్నారు. వైట్ ఫీల్డ్‌లో రూ.1300కి గది దొరుకుతుంది. కోరమంగళలో మాత్రం రూ.వెయ్యికి రూమ్ లభిస్తోంది. ఈ కష్ట సమయంలో ప్రజలకు సర్వ్ చేయడానికి తాము ఉన్నామని ఓయో ప్రతినిధి ఒకరు పీటీఐ వార్తాసంస్థకు తెలియజేశారు. ఇప్పటికే చాలా హోటళ్లు సింగిల్, డబుల్ రూమ్స్ మరో రెండు రోజుల వరకు ఇచ్చేశాయి. రాడిసన్ బ్లూ అటిరియాలో రూ.11 వేల 100కు గది దొరుకుతుంది.
దానికి ట్యాక్స్ అదనం అని చెబుతున్నారు. సింగిల్ రూమ్ కావాలంటే రూ.8 వేలు ఇవ్వాలంటున్నారు. అంతకుముందు ఇవీ రూ.10500 ప్లస్ ట్యాక్స్.. రూ.7500 ప్లస్ ట్యాక్స్‌గా ఉండేవని పీటీఐ తెలిపింది. ఇప్పుడు ఎంత లేదన్నా.. కనీసం రూ.2 నుంచి రూ.3 వేల వరకు ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications