మరిదితో అక్రమ సంబంధం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, పంచాయితీలు, ఇంటిలో శవమైనాడు !

బెంగళూరు/మడికేరి: అక్రమ సంబంధం కారణంగా ఓ అమాయకుడు బలి అయ్యాడు. కట్టుకున్న భర్త సోదరుడు (మరిది)తో అక్రమ సంబంధం సాగించిన మహిళ నిత్యం ఇంటిలో గొడవలకు కారణం అయ్యింది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని బంధువు వెళ్లి చూసే సరికి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. బంధువులు, స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య, ఆమె మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తండ్రి మరణించడం, తల్లి అరెస్టు కావడంతో వారి పిల్లలు అనాథలైనారు.

సంతోషంగా దంపతులు, పిల్లలు

సంతోషంగా దంపతులు, పిల్లలు

కర్ణాటకలోని మడికేరిలోని చెట్టెళ్ళి అభ్యుత్ మంగల ప్రాంతంలో రాజు (46), లీలా (37) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజు, లీలా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు, భార్య లీలాతో కలిసి రాజు చాలా కాలం సంతోషంగా కాలం గడిపాడు. తరువాత రాజు, లీలా ఇంటిలో సమస్యలు మొదలైనాయి.

మరిదితో రాసలీలలు

మరిదితో రాసలీలలు

రాజు తమ్ముడు ప్రశాంత్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ప్రశాంత్ ప్రతిరోజూ అన్న రాజు ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో రాజు భార్య లీలా, ప్రశాంత్ లు చాలా చనువుగా ఉండేవారు. తరువాత లీలా వరుసకు మరిది అయ్యే ప్రశాంత్ ను ముగ్గులోకి దింపింది. రాజు లేని సమయంలో ఇంటిలోనే లీలా, ప్రశాంత్ రాసలీలలు సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మంచం మీద రెడ్ హ్యాడెండ్ గా !

మంచం మీద రెడ్ హ్యాడెండ్ గా !

లీలా, ప్రశాంత్ లు ఓ సారి రాసలీలలు సాగిస్తున్న సమయంలో రాజు ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో మంచం మీద భార్య లీలా, తమ్ముడు ప్రశాంంత్ నగ్నంగా రెడ్ హ్యాండెడ్ గా చూసిన రాజు కోపం ఆపుకోలేక ఇద్దరికి దేహశుద్ది చేశాడు. తరువాత పెద్దలు పంచాయితీ చేసినా లీలా, ప్రశాంత్ బుధ్ది మాత్రం మారలేదు.

గొంతుకు తాడు, నేల మీద శవం

గొంతుకు తాడు, నేల మీద శవం

బుధవారం సాయంత్రం రాజు ఇంటికి వెళ్లాడు. తరువాత రాత్రి బంధువు మంజు రాజు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజు గొంతుకు తాడు బిగించి ఉండటం, చలనం లేకుండా అతను నేల మీద పడి ఉండటంతో మంజుకు అనుమానం వచ్చి అతని బంధువులు, స్థానికులకు సమాచారం ఇచ్చాడు.

భర్త తమ్ముడితో అసలు కథ

భర్త తమ్ముడితో అసలు కథ

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే రాజు ప్రాణాలతో లేడని వెలుగు చూసింది. రాజు భార్య లీలాను పోలీసులు ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానం ఇచ్చింది. రాజు బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు లీలా, ఆమె మరిది ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. లీలా ఆమె మరది ప్రశాంత్ తో అక్రమ సంబంధం సాగిస్తోందని, ఇదే విషయంలో రాజు చాలా సార్లు భార్యతో గొడవ పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజు పిల్లలను అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+