వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరాగాంధీ నా రాజకీయ గురువు: ప్రణబ్

ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తెచ్చిన జిఎస్‌టి సమాఖ్య స్పూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తెచ్చిన జిఎస్‌టి సమాఖ్య స్పూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

.పార్లమెంట్ సెంట్రల్‌హల్‌లో ఆదివారం నాడునిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సోమవారంతో ప్రణబ్ పదవీకాలం ముగియనుంది. 1969లో జూలైలో తాను తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టేనాటికి రాజ్యసభలో స్వాతంత్ర్యసమరయోధులు, అపర మేధావులు పార్లమెంట్‌లో ఉన్నారని ఆయయన గుర్తుచేశారు.

pranab farewell party

ఐదుసార్లు తాను రాజ్యసభసభ్యుడిగా , రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించిన విషయాన్ని ప్రస్తావించారు. తన వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తన రాజకీయ గురువు ఇందిరాగాంధీ అని ఆయన చెప్పారు. ఆమె మహోన్నత నాయకురాలని ఆయన ప్రశంసించారు. భిన్నమతాలు, జాతులు, భాషల ప్రజలంతా ఒకే దేశం, ఒకే జెండా కింద ఉండడం గర్వకారణమన్నారు.

చట్టాలు చేయాల్సిన పార్లమెంట్‌లో అధికార, విపక్షాలు వాగ్వాదాలతో సమయాన్ని వృధా చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రణబ్‌ను ఘనంగా సన్మానించారు. ఎంపీలందరి సంంతకాలతో కూడిన పుస్తకాన్ని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రణబ్‌కు అందించారు.

English summary
"I am a creation of this Parliament," President Pranab Mukherjee said on Sunday in an emotional farewell speech to the MPs in the Central Hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X