రాష్ట్రపతి ఎన్నికల వేళ.. యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలుః గేమ్ ఆఫ్ మనీ, సీక్రెట్ బ్యాలట్ అంటూ
న్యూఢిల్లీః రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ప్రాంగణాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. గెలిచిన అభ్యర్థి 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలా? లేక ఇక్కడితో ముగిసిపోవాలా? అనే నిర్ణయం ఈ ఎన్నికలపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలను గేమ్ ఆఫ్ మనీగా అభివర్ణించారు. ఆత్మప్రబోధానుసారంగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. తాను రాజకీయంగా పోరాటం చేయట్లేదని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయాల్సిన వ్యవస్థలన్నీ ఇప్పుడు నాశనం అయ్యాయని, పార్టీల చేతుల్లోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. వాటిని బతికించుకోవాల్సిన అవసరం ఉందని యశ్వంత్ సిన్హా అన్నారు.
వ్యవస్థలు నిర్వీర్యమౌతున్నాయని యశ్వంత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం, దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలను ప్రయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ లల్లో ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూల్చివేసిన సందర్భాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇదంతా గేమ్ ఆఫ్ మనీలా మారిందని పేర్కొన్నారు. ఈ విధానానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications