'దుస్తులు లేకుండా ఉండడమే నాకు ఇష్టం'
ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
బెంగుళూరు:ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారు, తాను కూడ అదే దిశలో పనిచేస్తున్నానని ఆయన ప్రకటించారు. ప్రజల మందు సంస్కారం కోసమే దుస్తుల్ని ధరిస్తున్నానని ఆయన చెప్పారు.

మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న జాతర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చన్నారాయన.
ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications