నాశనం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడైనా రెడీ: పంకజా ముండే
ముంబై: మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజా ముండే రాజీనామాకు సిద్ధమయ్యారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే తనను లక్ష్యంగా మార్చుకుంటున్నారన్నారు.
తన తండ్రి చనిపోయిన అనంతరం తన లేత భుజాలపై బాధ్యతలను మోశానని. తనను ఎంత వరకు లక్ష్యంగా మార్చుకుంటారని ప్రశ్నించారు. తనమీద అవినీతి ఆరోపణలు చేశారని, మరొకరేమో తాను బెదిరించానని ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొందరు తనను గూండా అంటున్నారన్నారు. అయినా, ఎవరూ ఏదీ నిరూపించలేక పోయారన్నారు. తన పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని, పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నానని ఆమె అన్నారు.
తాను ఎప్పుడైనా రాజీనామా చేయగలనని, తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. తన తండ్రి గోపినాథ్ ముండే వారసత్వంతో తాను రాజకీయాల్లోకి వచ్చాన్నారు. అలాంటి తన పైన కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications