ఎంతో ఇష్ట పడ్డా: ఆ అనుభవం ఎంతో భయానకం- సన్నీ లియోన్
ముంబై: మాజీ పోర్న్‌స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్.. సుదీర్ఘ విరామం తరువాత మీడియా ముందుకొచ్చారు. తన అనుభవాలను పంచుకున్నారు. ముంబైని గడగడలాడించిన భారీ వర్షాల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు.
సహజంగా తనకు వర్షాకాలం అంటే ఎంతో ఇష్టమని, పైగా ముంబై వాతావరణం అంటే తనకు ఎంతో ఇష్టపడతానని అన్నారు. ముంబైలో స్థిరపడటానికి, బీచ్ దగ్గరగా ప్లాట్ తీసుకోవడానికి అదే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. తనను భయపెట్టాయని పేర్కొన్నారు. ఇంత భారీ వర్షం పడుతుందని అసలు ఊహించలేకపోయానని చెప్పారు.

మొన్నటి భారీ వర్షాల సమయంలో సముద్రం భయానకంగా కనిపించిందని సన్నీ లియోన్ వ్యాఖ్యానించారు. ఇంటి గోడలు మొత్త తడిచి ముద్ద అయ్యాయని, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాలేనంతగా భయపడ్డానని అన్నారు. వర్షాల వల్ల తాను ఉంటోన్న ప్లాట్‌లోకి నీళ్లొచ్చాయని, రెండు రోజుల్లో మూడు కార్లు కొట్టుకుపోయాయని చెప్పారు.
ఒకేరోజు రెండు లగ్జూరియస్ కార్లు నీటిలో కొట్టుకునిపోతుంటే చూస్తూ ఉండిపోయానే తప్ప ఏమీ చేయలేకపోయినట్లు సన్నీ లియాన్ అన్నారు. ఇది అత్యంత భయానకమని పేర్కొన్నారు. వరదనీటిలో కొట్టుకుపోతున్న కార్లను చూస్తే ఏడుపొచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంపోర్టెడ్ కార్లను కొనుగోలు చేసినప్పుడు వాటికి కట్టే పన్ను చాలా ఎక్కువగా ఉంటోందని అన్నారు.
ఎనిమిది సీట్ల మెర్సిడెస్ కారు అంటే తనకు చాలా ఇష్టమని, ప్రేమతో దాన్ని చూసుకున్నానని సన్నీ లియాన్ అన్నారు. అది నీటిలో కొట్టుకుపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇప్పుడు ఇండియన్ మేడ్ కార్లను కొనడానికే ఇష్టపడుతున్నానని, అవి వర్షాకాల సీజన్‌కు అనుగుణంగా ఉంటాయని అన్నారు.












Click it and Unblock the Notifications