ఐసిఐసిఐ బ్యాంకు యూటర్న్.. మినిమం బ్యాలెన్స్ విషయంలో వెనక్కు!

ఐసిఐసిఐ బ్యాంకు యూటర్న్ తీసుకుంది. ఇటీవల ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చి మినిమం బ్యాలెన్స్ అమాంతం పెంచేసిన బ్యాంకు తాజాగా దిగొచ్చింది. ఆగస్టు ఒకటి తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే కస్టమర్లు ఏకంగా 50 వేల రూపాయలు మినిమం బాలన్స్ ఉంచాలని మినిమం బ్యాలెన్స్ ను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది .

మినిమం బ్యాలెన్స్ పెంచుతూ ఐసిఐసిఐ నిర్ణయం
దీనివల్ల ఖాతాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మినిమం బాలన్స్ ను తగ్గించింది. దీంతో ఐసిఐసిఐ కస్టమర్లకు భారీ ఊరటనిచ్చింది. రాఖీ పండుగ సమయంలో ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలో కనీస సగటు బ్యాలెన్స్ ను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది.

ICICI Bank U-turn Backtracking on minimum balance

బ్యాంకు నిర్ణయంపై ఖాతాదారుల్లో వ్యతిరేఖత
ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ నిబంధనలో భారీ పెంపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ భారీ పెంపు ఆగస్టు ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు మాత్రమే కాక, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో ఖాతాదారుల పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అందరూ భావించారు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

మినిమం బ్యాలెన్స్ ఎంత చేసిందంటే
ఈ క్రమంలోనే వెనక్కి తగ్గిన ఐసీఐసీసీ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కనీస నగదు నిల్వ మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించి ప్రకటన చేసింది. కొత్త మార్గదర్శకాలు, ఇతర చార్జీల గురించి వెబ్సైట్లో వివరాలను అప్డేట్ చేయడంతో పాటు, ఒక సర్కులర్ ను విడుదల చేసింది. ముఖ్యంగా మెట్రో, అర్బన్ ప్రాంతాలలో ఇటీవల సేవింగ్స్ ఖాతాలో నెలవారీగా సగటున 50 వేల రూపాయలు మెయింటైన్ చేయాలని స్పష్టం చేయగా దీనిని తాజాగా 15 వేల రూపాయలకు తగ్గించింది.

సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఇలా
ఇక సెమీ అర్బన్ ప్రాంతాలలో 25 వేల నుంచి 7,500 రూపాయలకు తగ్గించింది. గ్రామీణ ప్రాంతాలలో అంతకుముందు పదివేల రూపాయలకు మినిమం బాలన్స్ ఉండాలని చెప్పగా తాజాగా దాన్ని 2500 రూపాయలకు తగ్గించింది. మొత్తంగా ఏ ప్రైవేట్ బ్యాంకు పెట్టని విధంగా మినిమం బ్యాలెన్స్ రూల్ పెట్టి కస్టమర్ ల ఆగ్రహంతో నిర్ణయం మార్చుకుంది ఐసిఐసిఐ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+