రాష్ట్రపతి అభ్యర్థిగా స్వామినాథన్.. కొత్త పేరు సూచించిన శివసేన
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పదవికి ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలబెట్టే విషయంలో బీజేపీ మిత్రపక్షం శివసేన మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది.
ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పదవికి ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలబెట్టే విషయంలో బీజేపీ మిత్రపక్షం శివసేన మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది.
ఇంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును సూచించిన శివసేన.. తాజాగా ఆ పదవికి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేరును సూచించింది.
భగవత్ అభ్యర్థిత్వానికి బీజేపీ ఒప్పుకోకపోతే స్వామినాథన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సూచించనున్నారని పార్టీ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి విపక్షాల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
రాష్ట్రపతిఎన్నికల గురించి వారు ఆమెతో చర్చించారు. అంతకుముందు ఇదే విషయమై ఎన్సీపీ, తెలుగుదేశం పార్టీ అధినేతలు శరద్‌పవార్, చంద్రబాబు నాయుడుతో కూడా వెంకయ్యనాయుడు చర్చించారు.












Click it and Unblock the Notifications