మాటల్లేవ్! మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు: పాకిస్థాన్‌కు అమిత్ షా తీవ్ర హెచ్చరిక

పనాజి: భారత సరిహద్దలో తరచూ కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర హెచ్చరిక చేశారు. దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని గట్టిగా హెచ్చరించారు.

గురువారం అమిత్ షా గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్‌యూ)కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌పై దాడులను సహించబోమని, గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌తో నిరూపించామని హోంమంత్రి తెలిపారు.

 If Pakistan transgresses: More surgical strikes will must happen, warns Home Minister Amit Shah

ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ సారథ్యంలో పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ఓ కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దుల్లో ఆటంకాలు సృష్టించొదన్న సందేశం పంపామని హోంమంత్రి తెలిపారు. అప్పుడు చర్చలకు సమయం ఉండేది.. కానీ, ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందని అమిత్ షా స్పష్టం చేశారు.

గతంలో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్పూర్‌లలో పాక్ ఉగ్రమూకల దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుందని అమిత్ షా తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి.

గోవాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. గోవాలో మరోసారి అధికారంలోకి వస్తామంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. సైన్యంలో పనిచేసే అందరికీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) తీసుకొచ్చిన ఆయన అందరికీ గుర్తుండిపోతారని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రమోద్ సావంత్.. మనోహర్ పారికర్ మార్గంలో పయనించాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో తిరిగి అధికారం సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన గోవాకు నవంబర్ 15 నుంచి చార్టర్డ్ విమానాలు కూడా అనుమితిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+