మేం చేయాల్సింది చేస్తాం- కేంద్రానికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సంకేతం
Waqf amendment Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభ సమక్షానికి వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.
వక్ఫ్ బిల్లు గతంలో పార్లమెంట్ ముందుకు వచ్చినప్పటికీ- అది ఆమోదం పొందలేదు. అందులో సవరణలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జగదంబికా పాల్ దీనికి సారథ్యాన్ని వహించారు.

ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది.
ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది. ఆయా రాష్ట్రాల వక్స్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ ఛైర్మన్లతో మాట్లాడింది.
ఇప్పటివరకు ఈ జేపీసీ 38 సార్లు సమావేశమైంది. వక్స్ హెూదా, జిల్లా కలెక్టర్‌కు అధికారాలను అప్పగించడం, వక్స్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలను కల్పించడం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. జేపీసీకి 44 సవరణలు సైతం అందాయి. వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదం లభించింది.
ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఘాటుగా స్పందించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదని డిమాండ్ చేసింది. దీన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. వక్ఫ్ ప్రయోజనాలు, ఉద్దేశాలకు విఘాతంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజల్-వుర్- రహీం ముజాద్దిదీ, అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన సవరణలు వక్ఫ్ బిల్లును మరింత క్లిష్టంగా మార్చాయని అన్నారు. జేపీసీ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ఈ బిల్లు వివక్షతతో కూడుకున్నదని ధ్వజమెత్తారు. ఒక మతాన్ని ప్రేరేపించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. మతతత్వ కోణంలో చూడటం, అదే తరహాలో ఈ బిల్లును రూపొందించడం, దాన్ని సభలో ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. దేశ ప్రయోజనాలకు సైతం ఇది దెబ్బ తీస్తుందని వఇందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు గానీ, వివిధ రాష్ట్రాల మైనారిటీ కమిషన్లు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అభ్యంతరాలను జేపీసీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. తాము చూస్తూ కూర్చోబోమని తేల్చి చెప్పారు.
దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఖాసిం రసూల్ ఇల్యాస్ అన్నారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన, రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకుంటామని చెప్పారు. న్యాయస్థానాల్లో పోరాడతామని పేర్కొన్నారు. సవరణలను వెనక్కి తీసుకునే వరకు మేము శాంతియుతంగా ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications