Illegal affair: ప్రియుడితో ఆంటీ రొమాన్స్, ఎదురుతిరిగిన ఆంటీ కొడుకును చంపిన ప్రియుడు !

బెంగళూరు: భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కుటుంబ గొడవల కారణంగా కొన్ని ఏళ్ల క్రితం భార్య ఆమె భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా జీవనం సాగిస్తోంది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన 14 సంవత్సరాల తక్కువ వయసు ఉన్న వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. పని చెయ్యడానికి బయటకు వెళ్లి వస్తున్న తల్లి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం బయట ప్రియుడితో ఎంజాయ్ చేసిన మహిళ తరువాత ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుని జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. తన తల్లి కోసం పదేపదే ఓ వ్యక్తి ఇంటికి రావడం ఆమె 17 ఏళ్ల వయసు ఉన్న కొడుక్కి నచ్చలేదు. రాత్రి టైమ్ కాని టైమ్ లో ఇంటికి వచ్చిన ప్రియుడితో తల్లి బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ బిజీగా గడిపింది. ఆ సమయంలో కొడుకు తల్లి ప్రియుడిని మందలించి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో ప్రియుడు కత్తి తీసుకుని ప్రియురాలి కళ్ల ముందే ఆమె కొడుకుని దారుణంగా పొండిచి చంపేశాడు.

భర్తకు టాటా చెప్పి బయటకు తరిమేసిన భార్య

భర్తకు టాటా చెప్పి బయటకు తరిమేసిన భార్య

బెంగళూరులోని హలసూరులో గీతా (38) అనే మహిళ నివాసం ఉంటున్నది. 19 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న గీతా నందు (17), మరో కొడుక్కి తల్లి అయ్యింది. కుటుంబ గొడవల కారణంగా కొన్ని ఏళ్ల క్రితం భర్తను వదిలేసిన గీతా హలసూరులోని మార్ఫీటౌన్ లో ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా జీవనం సాగిస్తోంది.

ఇళ్లల్లో పని చేస్తున్న గీతాకు బాయ్ ఫ్రెండ్

ఇళ్లల్లో పని చేస్తున్న గీతాకు బాయ్ ఫ్రెండ్


శ్రీమంతులు నివాసం ఉండే అపార్ట్ మెంట్స్ లో గీతా ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇళ్లలో పని చేస్తున్న గీతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోందని తెలిసింది. ఇదే సమయంలో బాగలూరులో నివాసం ఉంటున్న శక్తివేల్ (24) అనే యువకుడితో గీతాకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది.

జల్సా చేస్తున్న తల్లి

జల్సా చేస్తున్న తల్లి

శక్తివేల్ సొంతంగా ఆటో నడుపుతున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయం అయిన తనకంటే 14 సంవత్సరాల తక్కువ వయసు ఉన్న శక్తివేల్ తో గీతా అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త దూరంగా ఉండటం, కొడుకులు ప్రశ్నించరనే ధైర్యంతో గీతా పని చెయ్యడానికి బయటకు వెళ్లి వస్తున్నానని బిడ్డలకు చెప్పి ఆమె ప్రియుడు శక్తివేల్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

డైరెక్టుగా ఇంటికి వెలుతున్న ప్రియుడు

డైరెక్టుగా ఇంటికి వెలుతున్న ప్రియుడు

చాలాకాలం బయట ప్రియుడు శక్తివేల్ తో ఎంజాయ్ చేసిన గీతా తరువాత ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుని జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. నువ్వు ఇంటిలో లేని సమయంలో వేరే ప్రాంతం నుంచి శక్తివేల్ అనే యువకుడు వచ్చి వెలుతున్నాడని స్నేహితులు గీతా కొడుకు నందుకు చెప్పారు.

అభ్యంతరం వ్యక్తం చేసిన కొడుకు

అభ్యంతరం వ్యక్తం చేసిన కొడుకు

తన తల్లి గీతా కోసం పదేపదే శక్తివేల్ ఇంటికి రావడం ఆమె 17 ఏళ్ల వయసు ఉన్న కొడుకు నందుకు నచ్చలేదు. మన ఇంటికి శక్తివేల్ ఎందుకు వస్తున్నాడని, అసలు వాడు ఎవడని నందు ఆమె తల్లి గీతాను ప్రశ్నించాడు. శక్తివేల్ మనకు బంధువు అవుతాడని, మన గురించి తెలుసుకోవడానికి వచ్చి వెలుతున్నాడని గీతా ఆమె కొడుకు నందుకు ఇంతకాలం మాయమాటలు చెబుతూ వచ్చింది.

రాత్రి తల్లితో రొమాన్స్ చేస్తుంటే ఎదురు తిరిగిన కొడుకు

రాత్రి తల్లితో రొమాన్స్ చేస్తుంటే ఎదురు తిరిగిన కొడుకు

రాత్రి టైమ్ కాని టైమ్ లో హలసూరులో మార్ఫీటౌనో లోని గీతా ఇంటికి వెళ్లిన శక్తివేల్ బెడ్ రూమ్ లో ఆమె రొమాన్స్ చేస్తూ బిజీగా గడిపాడు. ఆ సమయంలో బయటను నుంచి వెళ్లిన నందు అతని తల్లి గీతాతో పాటు ఆమె ప్రియుడు శక్తివేల్ మీద మండిపడ్డాడు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోవాలని నందు అతని తల్లి గీతా ప్రియుడు శక్తివేల్ కు వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియురాలి ముందే ఆమె కొడుకును పొడిచేసిన ప్రియుడు

ప్రియురాలి ముందే ఆమె కొడుకును పొడిచేసిన ప్రియుడు

ఆ సమయంలో శక్తివేల్, నందు మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోలపోయిన శక్తివేల్ ప్రియురాలు గీతా ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని చంపేస్తానని నందును బెదిరించాడు తరువాత కత్తి తీసుకున్న శక్తివేల్ అతని ప్రియురాలు గీతా కళ్ల ముందే ఆమె కొడుకు నందును దారుణంగా పొండిచి చంపేశాడు.

 తల్లి ప్రియుడి చేతితో కొడుకు బలి

తల్లి ప్రియుడి చేతితో కొడుకు బలి

నందు కుప్పకూలడంతో గీతా గట్టిగా కేకలు వేసి తన కొడుకును ఎవరో పొడిచేశారని నాటకాలు ఆడింది. స్థానికులు నందును వెంటనే సమపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నందు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న డీసీపీ డాక్టర్ ఎస్.డి. శరణప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

Recommended Video

    డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న టీటీడిపి
    ప్రియుడి కోసం కొడుకుని చంపించిన తల్లి ?

    ప్రియుడి కోసం కొడుకుని చంపించిన తల్లి ?

    నందును హత్య చేసిన అతని తల్లి గీతా ప్రియుడు శక్తివేల్ ను పోలీసులు పట్టుకున్నారు. కొడుకును చంపేయాలని ప్రియుడు శక్తివేల్ కు గీతా రెచ్చగొట్టిందని ఆరోపణలు రావడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హలసూరు పోలీసులు అంటున్నారు. మొత్తం మీద తల్లి కామానికి వయసుకు వచ్చిన కొడుకు బలికావడం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+