బుల్‌బుల్ తుపాన్ ఎఫెక్ట్: ఆరెంజ్ అలర్ట్ జారీ, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు..
బుల్‌బుల్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. పశ్చిమబెంగాల్‌పై తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. బెంగాల్‌లోని కోస్తా తీర ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. పశ్చిమమధ్య, తూర్పు మధ్య బే ఆఫ్ బెంగాల్ మధ్య కదులుతుందని వెల్లడించింది.
పశ్చిమబెంగాల్ సాగర్ ద్వీపం దక్షిణ-దక్షిణ పడమర 450 కిలోమీటర్ల దూరంలో.. బంగ్లాదేశ్లోని ఖేపురారా దక్షిణ దక్షిణ పడమర 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధకారులు తెలిపారు. బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్‌పై తుపాన్ అధిక ప్రభావం చూపిస్తోంని తెలిపారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శనివారం తుపాన్ తీవ్ర రూపం దాలుస్తోందని అధికారులు చెప్పారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలెర్ట్‌ను అధికారులు జారీచేశారు.
బుల్‌బుల్ తుపాన్ ప్రభావంతో మధ్య బెంగాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ 24 పరగణ జిల్లాలు, ఈస్ట్ మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తుపాన్‌తో బెంగాల్ తీర ప్రాంతంలో మోస్తారు వర్షం, పిడుగులు పడతాయని వివరించారు. కోల్‌కతా తీరప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications