చల్లటి శుభవార్త వినిపించిన ఐఎండీ
ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం వేడి వాతావరణం నెలకొంది. మంగళవారం మాత్రం పశ్చిమ హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ్ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల ఐదోతేదీ నుంచి ఏడో తేదీ వరకు తూర్పు, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురవడంతోపాటు హిమపాతం కూడా నమోదవుతుందని వెల్లడించింది. దీనివల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని భావిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షం, హిమపాతం వల్ల 5 నేషనల్ హైవేస్ తోపాటు 600 కుపైగా రహదారులను మూసేశారు. భారీ మంచువల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 1436 సబ్ స్టేషన్లతోపాటు 124 తాగునీటి సరఫరా కేంద్రాలను కూడా మూసేశారు. ఆదివారం కురిసిన వర్షానికి లాహౌల్ లో తాండి వంతెన కూరుకుపోయిన ఘటనలో కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి.

కొండ ప్రాంతాల నుంచి వీస్తున్న చలి గాలులవల్ల ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం 24 నుంచి 95 కు మూడు రోజులుగా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ వారంలో ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం దేశ రాజధానిలో వాయు నాణ్యత 140గా ఉంది. మరోవైపు దక్షిణాదిలో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిసా రాష్ట్రాల్లో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీలో ఎండలు అధికంగా ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications