సౌత్ నుంచి ఇండియా ప్రధాని?
PM Modi: దేశంలో రాజకీయ పరిణామలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి- కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఓట్ల లెక్కింపు తరువాత కూటమిలో లుకలుకలు ఏర్పడటం శరవేగంగా సాగిపోయాయి.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్డీఏ సంకీర్ణ కూటమికి 292కి కాస్త అటు ఇటుగా ఉంటోన్నాయి. 400లకు పైగా సీట్లను సాధిస్తామంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ధీమాగా చెప్పిన బీజేపీ నాయకులు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలతో డీలా పడ్డారు. బీజేపీకి అత్యంత బలమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి ఇండియా హవా వీచింది.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. అదే సమయంలో ఎన్డీఏకు ఈ అవకాశం లభించింది.
ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు గాలం వేశారు ఇండియా కూటమి నాయకులు. ఆయనను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు మద్దతు ఇస్తే కీలక పదవి ఇస్తామంటూ హామీలను ఇస్తోన్నారు.
ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఇండియా కూటమి నాయకులు సమావేశం కానున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరుగనుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, డీ రాజా, సీతారాం ఏచూరి, చంపై సోరెన్, ఫరూక్ అబ్దుల్లా.. వంటి నాయకులు దీనికి హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారిందులో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను దక్కించుకోవాలి? తమకు మద్దతు ఇవ్వడం అంటూ జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గానీ, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీష్ కుమార్‌కు గానీ ఎలాంటి ఆఫర్లు ఇవ్వాలనేది ఇందులో తేల్చుతారు.
అదే సమయంలో- ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంపైనా ఓ నిర్ణయానికి వస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న తరువాతే ప్రధాని అభ్యర్థి పేరును నిర్ణయించాలని కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానించుకుంది. ఆ అవకాశమే లభిస్తే- దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయవచ్చనే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications