వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ నిర్ణయాలతో ఆర్మీ బలహీనం: ఆ విషయం తెలిసే రెచ్చిపోతున్న చైనా - సంచలన నివేదిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ చెప్పే మాట- మేకిన్ ఇండియా. అన్ని రకాల ఉత్పత్తులు కూడా స్వదేశంలోనే తయారు కావాలనే ఉద్దేశంతో ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ మేకిన్ ఇండియా పేరు దేశంలో వినిపిస్తూనే ఉంది. అలాగే- రక్షణ రంగానికీ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సైన్యానికి అప్పగిస్తోన్నామని కేంద్రం తరచూ చెబుతోంది.

మేకిన్ ఇండియా నిజస్వరూపం..

మేకిన్ ఇండియా నిజస్వరూపం..

పొరుగునే పొంచివున్న చైనా, పాకిస్తాన్ నుంచి తరచూ ఉద్రిక్తతలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోందనే అభిప్రాయం ప్రతి పౌరుడిలోనూ ఉంది. భారత త్రివిధ దళాలన్నీ మోదీ హయాంలో అత్యంత శక్తిమంతంగా రూపుదిద్దుకొన్నాయని, మేకిన్ ఇండియాలో భాగంగా ఆయుధ సామాగ్రి తయారీలో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందనే వాదనలు ఉన్నాయి.

ఫైటర్ జెట్స్..

ఫైటర్ జెట్స్..

వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందనే సంచలన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. సైన్యంలో అత్యంత కీలకమైన ఆయుధాల కాల పరిమితి తీరినప్పటికీ- రక్షణ మంత్రిత్వ శాఖ వాటిని రీప్లేస్ చేయలేకపోతోందని, ఇది మున్ముందు మరిన్ని ఇబ్బందులకు దారి తీయొచ్చని అంచనా వేసింది. 2026 నాటికి త్రివిధ దళాలలను హెలికాప్టర్ల కొరత వెంటాడుతుందని అభిప్రాయపడింది. 2030 నాటికి ఫైటర్ జెట్స్‌ సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని పేర్కొంది.

స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణరంగం

స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణరంగం

ఉత్పాదక రంగంలో కనీసం 30 నుంచి 60 శాతం వరకు దేశీయ వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. దీన్ని రక్షణరంగానికి కూడా విస్తరింపజేయడం వల్ల ఈ ఇబ్బందులు వస్తోన్నాయనే అంచనాలు ఉన్నట్లు తెలిపిందీ నివేదిక. ఇంతకుముందు అలాంటి పరిమితులు లేవు. ఆయుధ సామాగ్రి లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి చేసే ఖర్చులో కొంత మొత్తాన్ని దేశీయ తయారీకి ఉపయోగించేది కేంద్రం.

చైనాతో పోల్చుకుంటే బలహీనం..

చైనాతో పోల్చుకుంటే బలహీనం..

2020లో లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య చోటు చేసుకున్న ఘర్షణల తరువాత సరిహద్దులను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది భారత్. పాకిస్తాన్ కంటే అధిక ప్రమాదకారిగా మారింది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించడంలో చైనాతో పోల్చుకుంటే భారత్ బలహీనంగా ఉందని ఈ తాజా నివేదిక పేర్కొంది.

ఇప్పటికీ.. డీజిల్‌తోనే

ఇప్పటికీ.. డీజిల్‌తోనే

చైనా సరిహద్దు వెంబడి చైనా దురాక్రమణను అరికట్టడానికి అవసరమైన నిఘా ఉంచేలా హెలికాప్టర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. కేంద్రం అలా చేయలేకపోతోందని తెలిపింది. ఈ నివేదికను బ్లూంబర్గ్ ప్రచురించింది. భారత సైన్యం మేకిన్ ఇండియా కింద రూపొందించిన కొన్ని రక్షణ వస్తువుల కొనుగోళ్లను పెంచినప్పటికీ, ఇంకా డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు, ట్విన్-ఇంజిన్ ఫైటర్ల వంటి క్లిష్టమైన ప్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయట్లేదని తెలిపింది.

విదేశాల నుంచి దిగుమతికి బ్రేక్..

విదేశాల నుంచి దిగుమతికి బ్రేక్..

విదేశీ తయారీదారుల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. దేశీయంగా తయారు చేసిన సింగిల్-ఇంజిన్ యుద్ధ విమానాలు, అలాగే దేశంలో ఇంకా అందుబాటులో లేని ట్విన్-ఇంజిన్ యుద్ధ విమానాలను స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేయలని మోదీ ప్రభుత్వం భావిస్తోండటమే. ఫలితంగా- రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ సామాగ్రి, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను విదేశాల నుంచి కొనుగోలు చేయలేకపోతోంది.

ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకరంగా..

ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకరంగా..

ప్రత్యేకించి- వైమానిక దళం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి, భారత వైమానిక దళం 30 కంటే తక్కువ ఫైటర్ స్క్వాడ్రన్‌లు ఉంటాయని తెలిపింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద బలమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండాలంటే కనీసం 42 ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరం అవుతాయి. కాలం తీరిన అరడజనుకు పైగా స్క్వాడ్రన్లను బలవంతంగా తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు.

హెచ్ఏఎల్ సిద్ధంగా ఉన్నా..

హెచ్ఏఎల్ సిద్ధంగా ఉన్నా..

బెంగుళూరుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రతి సంవత్సరం ఎనిమిది స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. ఫైటర్ స్క్వాడ్రన్‌లో ఇది సగం మాత్రమే. 2026 నాటికి ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని హెచ్ఏఎల్ భావిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తోన్నందు వల్ల రష్యా.. సకాలంలో వాటిని తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక, ఇతర పరికరాలను అందజేయలేకపోతోంది.

కాలం చెల్లిన హెలికాప్టర్లు..

కాలం చెల్లిన హెలికాప్టర్లు..

వైమానిక దళంలో ఉండే హెలికాప్టర్లు మరొక సమస్యగా మారాయి. వైమానిక దళం, ఆర్మీ, నౌకాదళం ఇప్పటికీ 1970 నాటి తేలికపాటి హెలికాప్టర్లనే వినియోగిస్తోన్నాయి. వాటిని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది భారత్. ఆర్మీలోని హెలికాప్టర్లు ఇప్పటికే 30 సంవత్సరాల జీవితకాలాన్ని అధిగమించాయని రక్షణ మంత్రిత్వ శాఖ సైతం స్పష్టం చేస్తోంది. దేశీయంగా రూపుదిద్దుకున్న తేలికపాటి హెలికాప్టర్లు 2026 నుంచి 2030 నాటికి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయట్లేదు కేంద్రం. రష్యన్ కామోవ్-226టీ హెలికాప్టర్లను తయారు చేసే ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు.

హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనల్లో..

యుటిలిటీ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సైన్యానికి ఆదేశాలు అందినట్లు ఈ నివేదిక తెలిపింది. కాలం తీరిన/తీరడానికి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లను బలవంతంగా వినియోగిస్తోండటం వల్ల అవి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 2017 నుంచి సైనిక హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనల్లో 31 మంది సైనికులు మరణించారు. 19 మంది గాయపడినట్లు పార్లమెంట్ రికార్డులు స్పష్టం చేస్తోన్నాయి.

ఆర్ అండ్ డీపై అంచనాలు లేకుండానే..

మోదీ ప్రభుత్వం దిగుమతి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రపంచ స్థాయి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉపయుక్తంగా ఉండట్లేదని, రక్షణ వ్యవస్థను ఆధునికీకరించడంలో ఎప్పుడూ రాజీ పడకూడదని న్యూఢిల్లీకి చెందిన రక్షణ నిపుణుడు రాహుల్ బేడీ అన్నారు. దేశీయంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలంటే బిలియన్ డాలర్ల పెట్టుబడి సంవత్సరాల పాటు కొనసాగించిన పరిశోధన అవసరమనే వాస్తవాన్ని మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవట్లేదని చెప్పారు.

English summary
India Is Running Low on Weapons to Deter China due to Modi govt decisions, According to Report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X