అధ్బుతంగా పనిచేస్తోంది: మామ్‌ను మరో 6 నెలలు పొడిగించిన ఇస్రో
బెంగుళూరు: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలో దిగ్విజయంగా ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ప్రయోగం విజయవంతం కావడంతో, దీని జీవితకాలాన్ని మరో 6 నెలలు పాటు పొడిగించాలని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) మంగళవారం నిర్ణయం తీసుకుంది.
మామ్ ఉపగ్రహంలో ఇంకా 37 కిలోల ఇందనం మిగిలి ఉందని ఇస్రో అధికార ప్రతినిధి దేవీ ప్రసాద్ కార్నిక్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మామ్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.

అది మరో ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం మనుగడ సాగిస్తోందని తెలిపారు. గత ఏడాది మామ్ ఉపగ్రహం అంగాకరకుడి కక్ష్యలో ప్రయోగించినప్పుడు ఆరు నెలలు పాటు సేవలందిస్తుందని మొదట భావించారు.
అయితే ఇప్పుడు అది అంచనాలను మించి పని చేయడం సంతోషం కలిగించే విషయమని అన్నారు. ఇక మామ్‌ను 2013 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహారి కోట నుంచి పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం గత ఏడాది సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications