దేశమంతా ఒకే పన్ను విధానానికి కొద్దిగంటల్లోనే శ్రీకారం
జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది.ఈ మేరకు శుక్రవారం నాడు అర్ధరాత్రి నుండి జీఎస్టీని అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది
న్యూఢిల్లీ: జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది.ఈ మేరకు శుక్రవారం నాడు అర్ధరాత్రి నుండి జీఎస్టీని అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అతిరథ మహరథులు హాజరుకానున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

జిఎస్టీని ప్రారంభించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
2011,2012 లో ఆర్థికమంత్రిగా తానే కమిటీతో చర్చలు జరిపాను
పన్ను విధానంలో సమగ్రమైంది జిఎస్టీ.
2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ ముసాయిదా కమిటీ తొలి ముసాయిదాను ఇచ్చింది
2002 లో జిఎస్టీ ప్రక్రియ ప్రారంభమైంది.
2009 నవంబర్ లో జిఎస్టీ తొలి సమావేశం జరిగింది
ప్రధానమంత్రి మోడీ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు.
జిఎస్టీ వ్యవస్థ సరళమైంది.
చిన్న సాఫ్ట్ వేర్ తో తమ పన్నులను తామే చెల్లించుకోవచ్చు
గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్
సర్ధార్ పటేల్ దేశంలో అనేక సంస్థాలను విలీనం చేశారు
జిఎస్టీ దేశాన్ని ఏకం చేస్తోంది
అఖిలపక్ష వాదనల నుండి మధ్యే మార్గాన్ని ఎంచుకొని జిఎస్టీ ఏర్పడింది
భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్టే, జిఎస్టీ 18 సమావేశాలు జరిగాయి
జీఎస్టీ సహకార సమాఖ్య విధానానికి ఓ గొప్ప ఉదహరణ
పేదలకు ఇబ్బందులు లేకుండా జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
అనేక చర్చల తర్వాతే జిఎస్టీ రూపుదిద్దుకొంది.
జిఎస్టీ కేవలం ఆర్థిక సంస్కరణే కాదు, దేశాన్ని ఏకతాటికిపైకి తెచ్చే ప్రక్రియ
ఈ విజయం ఏ ఒక్క ప్రభుత్వానిదో కాదు అందరిది
అందరం కలిసి దేశాభివృద్ది దిశగా కీలక అడుగు వేశాం
జిఎస్టీతో దేశంలో కొత్త శకం ఆరంభంకానుంది
ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం తర్వాత మోడీ ప్రసగించారు
ఇకపై వ్యాపారాలన్నీ ఆన్ లైన్ లో సాగుతాయి.
జిఎస్టీతో రాష్ట్రాల స్వతంత దెబ్బతినదు
దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణను అమలుచేస్తున్నాం
జిఎస్టీతో కొత్త శకం ప్రారంభమైంది.
ఇకపై ఒకే దేశం ఓకే మార్కెట్ పన్ను అమల్లోకి రానుంది.
జిఎస్టీ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది
స్వాగతోపాన్యాసం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
పార్లమెంట్ కు చేరుకొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, స్వాగతం పలికిన ప్రధాని, మంత్రులు
పవర్ లూమ్, చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ధర్నా.
జీఎస్టీ 18వ, కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఎరువులపై ప్రతిపాదించిన 12 శాతం వస్తుసేవల పన్నును 5 శాతానికి తగ్గించారు.
ఢిల్లీలోని శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం జరిగింది.జీఎస్టీ అమలుపై తుది కసరత్తు నిర్వహించారు.
ట్రాక్టర్ల విడిబాగాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18శాతానికి తగ్గించారు.
జిఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ భవనాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, లోకస్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
జీఎస్టీ ప్రారంభోత్సవానికి హజరుకాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ బాటలోనే వామపక్షాలు డీఎంకె లు నడవనున్నాయి.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications