విషాదం:అమెరికాలో రోడ్డు ప్రమాదంలోటెక్కీ మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:అమెరికాలో ఉంటున్న ఇండియన్లకు కలిసిరావడం లేదు.అయితే జాతి విద్వేష దాడులు మరువకముందే రోడ్డు ప్రమాదంలో ఓ టెక్కీ మరణించాడు. అమెరికాలోని కొలంబస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడు.

అమెరికాలో స్థిరపడిన అన్షుల్ శర్మ, అతడి భార్య సమీరా భరద్వాజ్ రోడ్డు వెంబడి నడుచుకొంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అన్షుల్ శర్మ అక్కడికక్కడే మరణించాడు.

road accident

ఆయన భార్య సమీరా తీవ్రంగా గాయపడి ప్రాణపాయస్థితిలో ఉంది. ఈ ప్రమాదానికి మైఖేల్ డేమై గా గుర్తించారు .అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

డీజిల్ ఇంజిన్ తయారీ కర్మాగారంలో అన్షుల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడి మృతదేహన్ని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు మృతుడి కుటుంబసభ్యులకు ఆపన్నహస్తం అందించాలని కోరుతూ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 30-year-old Indian engineer was killed and his wife critically injured when a minivan driver, apparently intoxicated, rammed them from behind in the US city of Columbus
Please Wait while comments are loading...