తీపి కబురు: రైల్వేశాఖలో లక్ష ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఇండియన్ రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది.సుమారు లక్ష మందికి ఉద్యోగావకాశాలను కల్పించనుంది.విభాగాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేశాఖ సుమారు లక్ష ఉద్యోగాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. దాదాపు లక్షమంది ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది.

సీ, డీ గ్రూపుల ఉద్యోగులకోసం నిర్వహించనున్న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో డీ గ్రూపునకు గాను 63వేలమందికి అవకాశం కల్పించనుంది.

పలు ఉద్యోగాల భర్తీ

పలు ఉద్యోగాల భర్తీ

కేంద్రప్రభుత్వం రైల్వే శాఖలో సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్లు, స్విచ్‌మెన్‌, ట్రాక్‌మెన్‌, పోర్టర్లు లాంటి ఇతర పోస్టుల నియామకం కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 62,907 డి గ్రూపు పోస్టుల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు మంత్రి పీయూష్‌గోయల్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

పదవ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు

పదవ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు

పదవ తరగతి పాస్ లేదా ఐటీఐ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ కలిగిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12వ తేదిగా నిర్ణయించారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 18 వేలుగా నిర్ణయించారు. అయితే ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయస్సు 18-31 సంవత్సరాలుగా ఉండాలి.

లోకో పైలెట్ల ఖాళీల భర్తీ

లోకో పైలెట్ల ఖాళీల భర్తీ


గ్రూప్ సి కింద టెక్నీషియన్లు, అసిస్టెంట్ లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీతోపాటు ఈ ఏడాది 30,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ప్రకటించారు.

భద్రతకు రైల్వేశాఖ ప్రాధాన్యత

భద్రతకు రైల్వేశాఖ ప్రాధాన్యత


రైల్వేశాఖ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు రైల్వేశాఖాధికారులు ప్రకటించారు. చాలా నియామకాలు భద్రత విభాగానికి చెందిన నియామకాలు ఉంటాయని రైల్వే శాఖాధికారులు ప్రకటించారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏటా రూ. 3-4వేల కోట్లు రైల్వే ఖజానా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Railways has initiated a massive recruitment drive to hire 89,000 employees in levels C and D. This recruitment drive has been started to hire for the posts of assistant loco pilots, technicians, switchmen, trackmen, helpers, porters and many other openings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X