పాక్ దారికి రాకపోతే.. తీవ్ర పరిణామాలు

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి చొరబాట్లు సైతం చోటు చేసుకుంటోండటంతో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటోంది. రెప్ప వాల్చకుండా పహారా కాస్తోంది.

అదే సమయంలో పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కేంద్రం. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా.. 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ట్రీటీ రద్దును కొనసాగిస్తోంది. ఇందులో ఎలాంటి మార్పూ లేదని తాజాగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌కు నీటి సరఫరా చేసే నదులపై నిర్మించిన రిజర్వాయర్ల గేట్ల చుక్క నీటినీ విడుదల చేయదలచుకోలేదని పేర్కొంది.

Indus Water Treaty will remain in abeyance says MEA

ఇండస్ వాటర్ ట్రీటీ ఇంకా అబేయన్స్ లోనే ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకునేంత వరకూ ఇది కొనసాగుతుందని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదనీ అన్నారు.

ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు ప్రభావం ఇప్పటికే పాకిస్తాన్‌పై తీవ్రంగా పడింది. ఖరీఫ్ సీజన్‌ను దెబ్బ కొట్టింది. ఖరీఫ్ లో సరఫరా కావాల్సిన నదీ జలాల్లో 21 శాతం కొరత ఏర్పడినట్లు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. చీనాబ్ నదీ ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్‌లో 21 శాతం నీటి కొరత తలెత్తిందని అంచనా వేసింది.

పాకిస్తాన్‌లో ఖరీఫ్ సీజన్‌ పంటలకు సింధు నదీ జలాలే ప్రాణవాయువు. సింధు- దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్‌లో 80 శాతం పొలాలకు నీరు సరఫరా అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌పై నిర్మించిన సలాల్, రాంబన్ జిల్లాల్లో నిర్మితమైన బాగ్లిహార్ రిజర్వాయర్ల నుంచి ప్రతి సీజన్‌లోనూ ఈ నీళ్లు విడుదల అవుతుంటాయి.

ఇండస్ వాటర్ ట్రీటీలో యధాతథ స్థితి ఇక ముందు కూడా కొనసాగుతుందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఒప్పందం నిలిపివేత వల్ల పాక్ లో నీటి కొరత ఏర్పడిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

అమెరికాలో భారత అక్రమ వలసలపైనా రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. వలసదారుల అంశంపై అమెరికాతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోన్నామని, పరస్పరం సమన్వయం చేసుకుంటోన్నామని అన్నారు. అక్రమంగా అమెరికాలో నివసించడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పారు.

అక్రమంగా అమెరికాకు వెళ్లిన భారతీయుల డిపోర్టేషన్ విషయంలో పూర్తి వివరాలు అందిన తర్వాత తాము వారిని రప్పించుకుంటామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో 1,080 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించిందని వీరిలో 62 శాతం మంది కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా భారత్ కు చేరుకున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+