Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. ఏడాది పాప తల్లి ఆత్మహత్య!

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి సమయాన్ని, కెరీర్‌ను తినేస్తుంది. ఇందులో ఇన్‌స్టా రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతుంది. రీల్స్ మోజులో ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవల చాలా మంది రీల్స్ చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. కొంత మంది రీల్స్‌కు బానిసై ఈ అలవాటు నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ ఫోన్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ప్రజలు ఎంత బానిసలయ్యారంటే దీని కారణంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ప్రేమ వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత.. మొబైల్‌లో రీల్స్ చూడటం ఒక కుటుంబం నాశనం కావడానికి కారణమైంది.

అసలేం జరిగిందంటే?
బాత్రూంలో స్నానం చేస్తున్న భర్త తన భార్యను టవల్ తీసుకురావాలని అడుగుతూనే ఉన్నాడు. కానీ భార్య మంచంపై మొబైల్‌లో రీల్స్ చూస్తూ కూర్చుంది. కోపంతో భర్త బాత్రూం నుంచి బయటకు వచ్చి భార్యను కొట్టాడు. దీనితో ఆగ్రహించిన భార్య.. తన ఏడాది పాప గురించి కూడా ఆలోచించకుండా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

Insta Reels Obsession Mother of One-Year-Old Commits Suicide After Domestic Dispute in Jhansi

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం
మృతురాలు 20 ఏళ్ల రాధ ఝూన్సీ జిల్లా ఎరచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్కిల్ గ్రామానికి చెందినది. రాధ భర్త పేరు ప్రేమ ప్రకాష్. ఆమె పుట్టిల్లు ఔరయ్యాలో ఉంది. కుటుంబ సభ్యుల ప్రకారం.. రాధ అక్క ప్రియాంకకు ప్రేమ ప్రకాష్ గ్రామంలో ఒక బంధువు అబ్బాయితో వివాహం జరిగింది. దీంతో రాధ తరచుగా అక్క ఇంటికి వస్తూ ఉండేది. సుమారు 3 సంవత్సరాల క్రితం అక్కడే ఆమెకు ప్రేమ ప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం మొదలై, అది ప్రేమగా మారింది. ఈ ప్రేమ గురించి కుటుంబానికి తెలిసినప్పుడు, వారు 2 సంవత్సరాల క్రితం వారిద్దరికీ పెళ్లి చేశారు. వివాహం తర్వాత అంతా బాగానే ఉంది.

భర్త కొట్టడంతో మనస్తాపం
శనివారం సాయంత్రం ప్రేమ ప్రకాష్ పొలం నుంచి ఇంటికి వచ్చి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని భార్య బెడ్ మీదు పడుకుని మొబైల్‌లో రీల్స్ చూస్తోంది. స్నానం చేసిన తర్వాత ప్రేమ ప్రకాష్ తన భార్య రాధను టవల్ తీసుకురమ్మని అడిగాడు. చాలా సేపటి వరకు ఆమె టవల్ తీసుకురాలేదు. బయటకు వచ్చి చూస్తే భార్య రీల్స్ చూస్తోంది. బాత్రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మధ్య గొడవ జరిగింది. కోపంతో భర్త ప్రేమ ప్రకాష్ రాధను కొట్టాడు. దీనితో కోపంతో రాధ ఎలుకల మందు తినేసింది. ఆరోగ్యం విషమించడంతో ఆమెను గుర్సారయకు తరలించారు. అక్కడి నుంచి ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడ ఆమె మరణించింది.

టవల్ విషయంలో గొడవ
మృతురాలి భర్త ప్రేమ ప్రకాష్ టవల్ ఇవ్వకపోవడంపై జరిగిన గొడవ తర్వాత తన భార్య ఎలుకల మందు తినేసిందని.. దానితో ఆమె మరణించిందని తెలిపాడు. తమది ప్రేమ వివాహమని చెప్పుకొచ్చాడు. మృతురాలి సోదరి జ్యోతి మాట్లాడుతూ.. వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు తాము వారి ఇంట్లోనే ఉన్నామని, టవల్ విషయంలో గొడవ జరిగిందని, ఆ తర్వాత ఇదంతా జరిగిందని చెప్పింది.

ఈ విషయంలో ఎరచ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నిలేష్‌తో మాట్లాడగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మహిళను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారని వెల్లడించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+