ఇన్ స్టాగ్రామ్ లో సొల్లు కార్చుకునే ఫోటోలు, మోడల్, నటి కోట్లలో డీలింగ్, గ్యాంగ్ స్టర్స్ తో ?

పంజాబ్/ హర్యానా: సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాధించిన యువతి తరువాత ఆమె అందచందాలతో అనేక మందిని ఆకట్టుకుంది. మేడమ్ కు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రానురాను అర్దనగ్న ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఆమె కోటీశ్వరులకు వలవేసింది. అంతే పోర్న్ చాటింగ్ తో మేడమ్ కోట్ల రూపాయలు లూటీ చేస్తూ గ్యాంగ్ స్టర్లతో డీల్ చేస్తూ వచ్చింది.

పంజాబ్‌కు చెందిన జస్నీత్ కౌర్ అలియాస్ జస్నీత్ అనే యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జస్నీత్ కౌర్ చాలా పాపులర్ పర్సన్‌గా పేరు తెచ్చుకుంది. నటి, మోడల్ అయిన జస్నీత్ కౌర్ కు ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

 cash

ఇన్‌స్టాగ్రామ్‌లో సెమీ న్యూడ్ చిత్రాలు, సెక్సీ చిత్రాలను పోస్ట్ చేయడం ద్వారా జస్నీత్ కౌర్ ఇప్పటి వరకు వేలాది మందిని ఆకర్షించింది. జస్నీత్ కౌర్ ఆమెకు రిక్వెస్టులు పంపించే వ్యక్తులతో బూతులతో చాట్ చేస్తుంది. చాటింగ్ చేస్తున్న ఎదుటి వారి భాగోతం మొత్తం తెలుసుకుంటున్న జస్నీత్ కౌర్ తరువాత అసలు కథ మొదలుపెడుతోంది.

డబ్బున్న ధనవంతులను కనిపెట్టి వారితో చక్కగా మాట్లాడే జస్నీత్ కౌర్ దానిని అవకాశంగా తీసుకుని వారిని నిలువు దోపిడీ చేస్తోందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టా గ్రామ్ లో కోటీశ్వరులను మాత్రమే టార్గెట్ చేసుకుని దగ్గరవుతూ వారికి నగ్న చిత్రాలను పంపించిన జస్నీత్ కౌర్ తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోందని వెలుగు చూసింది.

instagram

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన వారిని జస్నీత్ కౌర్ కొందరు గ్యాంగ్‌స్టర్ల ద్వారా బ్లాక్ మెయిల్ చేయించి వారిని బెదిరించిందని వెలుగు చూసింది. పంజాబ్‌కు చెందిన గుర్బీర్ సింగ్ అనే వ్యాపారిని తన వలలో వేసుకున్న జస్నీత్ కౌర్ అతన్ని రూ. కోటి డబ్బులు ఇవ్వాలని బెదిరించింది. గత నవంబర్‌ నెలలో గుర్బీర్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు ఫోన్ లు వెళ్లాయి.

బెదిరిపోయిన వ్యాపారి గుర్బీర్ ఒకానొక సమయంలో రూ.35 లక్షలు జస్నీత్ కౌర్ కు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అయితే భయంతో మధ్యలోనే గుర్బీర్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు. జస్నీత్‌కు ముందుగా లక్ష రూపాయలు ఇచ్చిన గుర్బీర్ ఆమెకు నమ్మకం కలిగించాడు. మిగిలిన డబ్బు తీసుకోవాడానికి రావాలని వ్యాపారి గుర్బీర్ కిలాడీ లేడీ జస్నీత్ కౌర్ కు చెప్పాడు.

మిగిలిన డబ్బు తీసుకునేందుకు వెళ్లిన జస్నీత్‌ కౌర్ తో పాటు ఆమె ఇద్దరు సహచరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్లాక్‌మెయిల్‌ ద్వారా జస్నీత్ కౌర్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జస్నీత్ కౌర్ కు గతంలోనే క్రిమినల్ నేపథ్యం ఉందని, 2018లో ఇదే విధంగా ఫిర్యాదు రావడంతో జస్నీత్ ను అరెస్టు చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+